శివ శంక‌ర్ మాస్ట‌ర్ కు హీరో ధ‌నుష్ సాయం

ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ శివ శంక‌ర్ మాస్టర్ కు క‌రోనా నిర్ధార‌ణ అయిన విష‌యం తెలిసిందే. అయ‌న ప్ర‌స్తుతం హైద‌రాబాద్ ఏఐజీ ఆస్ప‌త్రి లో చికిత్స తీసుకుటుంన్నాడు. కాగ ఆయ‌న ఆరోగ్య పరిస్థితి విష‌మం గా ఉంది. అలాగే ఆయ‌న కు చికిత్స చేసుకోవ‌డానికి ఆర్థికంగా వెన‌క‌బ‌డ్డాడ‌ని.. ఆర్థిక సాయం కోసం త‌న కుటుంబ సభ్య‌లు చూస్తున్నార‌ని తెలిసింది. దీంతో ప‌లువురు సెల‌బ్రెటీ లు సాయం చేస్తున్నారు.

ఇప్ప‌టి కే హెల్పింగ్ స్టార్ సోను సూద్ కొరియో గ్రాఫ‌ర్ శివ శంక‌ర్ మాస్టర్ కు సాయం చేస్తాన‌ని ట్వీట్ట‌ర్ వేదిక గా ప్ర‌క‌టించాడు. తాజా గా త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ కూడా కొరియో గ్రాఫ‌ర్ శివ శంక‌ర్ మాస్ట‌ర్ కు సాయం చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు. కొరియో గ్రాఫ‌ర్ శివ శంక‌ర్ కు కరోనా వైర‌స్ ను కొలు కోవ‌డానికి అవ‌స‌రం అయిన వైద్య ఖ‌ర్చు ల కోసం ఆర్థిక సాయం చేస్తాన‌ని హీరో ధ‌నుష్ ప్ర‌క‌టించాడు. కాగ కొరియో గ్రాఫ‌ర్ శివ శంక‌ర్ ఆరోగ్య ప‌రిస్థితి కాస్త విష‌మం గా ఉంది. ఆయ‌న కు కరోనా వైర‌స్ త‌న ఊపిరితి్తుల‌ను 70 శాతం వ‌ర‌కు ప్ర‌భావితం చేశాయ‌ని వైద్యులు తెలిపారు.