కరోనా కొత్త వేరియంట్ పై రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు…

-

మన దేశంలో  కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గుతున్నా… విదేశాల్లో ముఖ్యంగా యూరోపియన్ దేశాల్లో వ్యాధి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఈ మార్చ్ నాటికి దాదాపు అక్కడ 7 లక్షల మరణాలు సంభవిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఇప్పటికే జర్మనీ, ప్రాన్స్, ఆస్ట్రీయా, రష్యాల్లో ప్రమాదఘంటికలు మోగుతున్నాయి. అయితే తాజాగా దక్షిణాఫ్రికాలో బయటపడిన కొత్త వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపరుస్తోంది. B.1.1529 రకం కరోనా వైరస్ ను దక్షిణాఫ్రికాలో కనుక్కున్నారు. ఈ రకం వైరస్ డెల్టా వైరస్ కన్నా ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటం కలవరపరుస్తోంది. ఇది ఎక్కువగా యువకులకు సోకుతుండటం ప్రమాద తీవ్రతను మరింత పెంచుతోెంది.corona-virus

తాజాగా కొత్త వేరియంట్ B.1.1529 పై కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా విదేశీ పర్యాటకుల విషయంలో రాష్ట్రాలను కేంద్రం అలెర్ట్ చేసింది. విదేశీ ప్రయాణిలకు స్క్రీనింగ్ పరీక్షలను పకడ్భందీగా చేయాలని సూచించిందివ. విదేశీ ప్రయాణికులకు కరోనా పరీక్షలు ఖచ్చితంగా చేయాలని తెలపింది. దక్షిణాఫ్రికా, హాంకాంగ్ నుంచి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని కేంద్రం, రాష్ట్రాలకు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news