సినిమా ప్లాప్ అయినందుకు బాధపడ్డానన్న కార్తికేయ.. ఓటీటీపైనే ఆశలు

ఇక ఈ మధ్య ఈ హీరో లావణ్య త్రిపాఠితో కలిసి చేసిన సినిమా చావు కబురు చల్లగా. కౌశిక్‌ పెగళ్లపాటి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ థియేటర్లలో పెద్దగా సందడి చేయలేకపోయింది. కాగా, శుక్రవారం నుంచి చావుకబురు చల్లగా మూవీని ఆహా ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఏర్పాటు చేసిన ఓ ప్రెస్‌మీట్‌లో హీరో ఎమోషనల్ అయ్యాడు.

చావు కబురు చల్లగా మూవీ తన మనసుకి బాగా దగ్గరైన సినిమా అని, కాక పోతే ఈ సినిమా కమర్షియల్‌గా అనుకున్నంత బాగా ఆడనందుకు బాగా బాధపడ్డానని తెలిపాడు. ఆ తర్వాత మా సినిమా చూసిన వాళ్లనుంచి వచ్చిన కొన్ని ప్రశంసలు ఊరటనిచ్చాయంటూ ఎమోషనల్ అయ్యాడు. బాలరాజు పాత్ర తనను మరో కోణంలో చూపించిందని.. ఇక మీదట ఇలాంటి పాత్రలు చేస్తానని చెప్పుకొచ్చాడు. అయితే తమ సినిమాను ఓటీటీ కోసం రీ ఎడిట్‌ చేశామని షాక్ ఇచ్చాడు. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తానని హామీ ఇచ్చాడు. చూడాలి మరి ఎడిట్ చేసిన మూవీ ఓటీటీలో ఏ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంటుందో.