ఏపీ రాజకీయాలపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో నిఖిల్..!!

-

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తాజాగా నటించిన చిత్రం కార్తికేయ 2.. ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతోంది.. ముఖ్యంగా బాలీవుడ్లో అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్ నటించిన చిత్రాలను సైతం వెనక్కి నెట్టింది ఈ సినిమా.. దీన్ని బట్టి చూస్తే ప్రమోషన్స్ అవసరం లేకుండానే నిఖిల్ సిద్ధార్థ్ కు బాలీవుడ్ లో కూడా క్రేజ్ ఏర్పడిందని చెప్పవచ్చు. ఇకపోతే తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించుకొని ఒక ఈవెంట్ ఏర్పాటు చేశారు. అందులో దిల్ రాజుతో సహా పలువురు ప్రముఖులు మాట్లాడం జరిగింది.ఇకపోతే సినిమా లో మంచి కంటెంట్ ఉంటే సినిమాను ఎవరైనా చూస్తారు.. కంటెంట్ ఉన్న సినిమాను మహా అయితే వాయిదా వేయించగలరు ఏమో కానీ తొక్కే అంత సీన్ లేదని మరొకసారి కార్తికేయ టు సక్సెస్ తో నిరూపించారు తెలుగు ప్రేక్షకులు. ఇక ఈ మూవీ సక్సెస్ సంబరాల్లో ఉన్న నిఖిల్ తాజా రాజకీయ పరిస్థితులపై కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశారు. ఇకపోతే గత ఎన్నికలలో వైసిపి పార్టీ తరఫున నిఖిల్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అక్కడ వైసిపి అభ్యర్థిగా పోటీ చేసిన అన్నం రెడ్డి అదీప్ రాజుకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు . ఆయన పెందుర్తి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచారు కూడా..Karthikeya 2: Nikhil's Film Propels on the Excellent Box Office Run — Transcontinental Timesవైసిపి పార్టీకి సపోర్ట్ చేశారు కదా? ఇప్పుడు పరిస్థితి ఏంటి? అదే పార్టీతో ఉంటారా ? అని ప్రశ్నించగా నేను సినిమాల్లో ఉన్నాను.. వైసిపి తో కాదు అంటూ సమాధానం ఇచ్చారు నిఖిల్.. ఇక గతంలో వైసిపికి సపోర్ట్ చేశారేంటి అంటే వాళ్లు మా బంధువులు అందుకే ప్రచారంలో పాల్గొన్నాను.. నేను సినిమాలో ఉన్నాను.. నేను ఒకే పార్టీతో లేను.. నా అనుకున్న వాళ్లు ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నాను.. గతంలో జెడి గారు జనసేనలో ఉన్నప్పుడు ఆయనకి కూడా సపోర్ట్ చేశాను.. హైదరాబాదులో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి అబ్బాయి సాయి పోటీ చేసినప్పుడు ఆయనకి సపోర్ట్ చేశాను. టిడిపికి కూడా సపోర్ట్ చేశాను.

నాకు ఏ పార్టీ లేదు.. పాలిటిక్స్ అవసరం లేదు.. నాకు తెలిసిన వ్యక్తులు ఎక్కడ ఉన్నా సరే వారికి సపోర్ట్ చేస్తాను.. పార్టీతో నాకు సంబంధం లేదు.. వ్యక్తులతోనే నాకు సంబంధం అంటూ చెప్పుకొచ్చారు నిఖిల్.
ఇక జగన్ ఒక యంగ్ లీడర్.. హార్డ్ వర్కర్ .. జగన్ పాలన ఎలా ఉంటుందో చూడాలని ఉంది . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి 100 సీట్లు రావాలని కోరుకుంటున్నాను . చంద్రబాబు కూడా ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ కు ఎంతో చేశారు అంటూ ఇలా పాలిటిక్స్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news