ఇంటర్ పూర్తి చేయకుండానే సచిన్ గొప్ప ఆటగాడయ్యాడు.. రామ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్..!

-

క్రికెట్ కు కేరాఫ్ అడ్రెస్ గా కోట్ల అభిమాన హృదయాల గెలిచిన క్రికెటర్ సచిన్ టెండుల్కర్ పుట్టినరోజు ఈరోజు. క్రికెట్ దేవుడిగా పిలుచుకునే సచిన్ కు సెలబ్రిటీస్ పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని స్పెషల్ ట్వీట్ చేశాడు. పార్క్‌లో కూర్చుని బిస్కెట్లు తినే పిల్లలకి ఎలా చెప్పినా వింటారు. బెడ్‌రూమ్‌ లాక్ వేసుకుని లైఫ్ ఎలా రా అనుకునే పిల్లలకి.. నిజాలు.. ఇలా చెప్తేనే వింటారు. ఇంటర్ కూడా పూర్తి చేయని, దేశం గర్వించదగిన వ్యక్తి సచిన్ టెండూల్కర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ రామ్ ట్వీట్ చేశాడు.

ఇంటర్ రిజల్ట్స్ లో ఫెయిల్ అయ్యారని విద్యార్ధులు సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. వారిని ఉద్దేశించి ఇంటర్ పూర్తి చేయకుండానే దేశం కోసం ఆడిన సచిన్ లాంటి వారు ఎంతోమంది ఉన్నారంటూ కేవలం ఇంటర్ ఫెయిల్ అయినంత మాత్రానా లైఫ్ లో ఫెయిల్ అయినట్టు కాదని కామెంట్ పెట్టాడు. రామ్ చేసిన ఈ ట్వీట్ కు నెటిజెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news