హీరో శ్రీకాంత్ ఇంట విషాదం.. ఏం జ‌రిగిందంటే..?

-

హీరో శ్రీకాంత్… తెలుగులో పరిచయం అక్కర్లేని పేరు. 1991లో పీపుల్స్ ఎన్‌కౌంటర్ సినిమా ద్వారా నట జీవితం ప్రారంభించాడు శ్రీకాంత్. అయితే తాజాగా హీరో శ్రీకాంత్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి మేకా పరమేశ్వరరావు ఈరోజు తెల్లవారుజామున రెండున్నర గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన గత నాలుగు నెలలుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ…స్టార్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

1948 మార్చి 16వ తేదీన కృష్ణాజిల్లా మేకావారిపాలెంలో జన్మించిన పరమేశ్వరరావు కర్ణాటకలోని గంగావతి జిల్లా బసవపాలెంకు వలస వెళ్లారు. ఆయనకు భార్య ఝాన్సీ లక్ష్మి, కుమార్తె నిర్మల.. కుమారులు శ్రీకాంత్, అనిల్ ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల తరువాత మహాప్రస్థానంలో పరమేశ్వరరావు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news