హీరో విక్రమ్ కి తీవ్ర గాయాలు.. విరిగిన పక్కటెముక

-

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన విలక్షణమైన నటనతో భాషతో సంబంధం లేకుండా అందరి అభిమానాన్ని పొందాడు. సినిమాలలో తన పాత్ర కోసం ఎంతటి రిస్క్ అయినా చేస్తాడు విక్రమ్. ఈ నేపథ్యంలోనే ఆయన తాజాగా నటిస్తున్న తంగలన్ సినిమా షూటింగ్ లో హీరో విక్రమ్ కి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది.

ఆయన తీవ్రంగా గాయపడినట్లు తమిళ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అంతేకాదు ప్రమాదంలో విక్రమ్ పక్కటెముక విరిగినట్లు సమాచారం. ప్రస్తుతం విక్రమ్ నీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడికి ఆపరేషన్ అవసరం అని వైద్యులు తెలిపారు. విక్రమ్ కి జరిగిన ప్రమాదాన్ని ధ్రువీకరించారు ఆయన మేనేజర్ సూర్యనారాయణన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version