హిట్ ట్విట్టర్ రివ్యూ… హిట్ కాదు బ్లాక్ బస్టర్…!

-

సంక్రాంతి తర్వాత మంచి సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న టాలీవుడ్ కి గత వారం భీష్మ సినిమా మంచి జోష్ ఇస్తే… ఈ వారం వచ్చిన హిట్ సినిమా బంపర్ హిట్ ఇచ్చింది. అవును ఈ సినిమా ట్విట్టర్ రివ్యు ఆధారంగా చూస్తే ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది అంటున్నారు. ఫలక్‌నుమా దాస్‌ తో హీరోగా పరిచయం అయిన విశ్వక్ సేన్ హీరోగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

నాచురల్ స్టార్ నాని ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు. ‘హిట్’. ‘ది ఫస్ట్ కేస్’ అనే ట్యాగ్ లైన్‌ తో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ అంటున్నారు. ఈ సినిమాలో రుహానీ శర్మ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ద్వారా డాక్టర్ శైలేష్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇటీవల స్నీక్ పీక్ అంటూ సినిమాలోని కీలక ఘట్టాన్ని ముందుగానే చెప్పేసి ఆ తరవాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను ప్రేక్షకులకు క్రియేట్ చేసారు.

దీనితో సినిమా చూడటానికి ప్రేక్షకులు క్యూ కట్టారు. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు మొదలైయాయి. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా చెప్తున్నారు. ఫస్టాఫ్ సినిమాకు సూపర్ హైలెట్ అంటున్నారు. ఈ సినిమా పాజిటివ్ టాక్ రావడంతో మౌత్ పబ్లిసిటి కూడా జరుగుతుంది. దర్శకుడు స్క్రీన్ ప్లే తో సినిమాను ఒక రేంజ్ లో నిలిపాడని అంటున్నారు. హీరో నటన సినిమాకు హైలెట్ గా నిలిచింది అంటున్నారు. ముఖ్యంగా కొన్ని సీన్స్ లో తన నటనతో కట్టిపడేసాడు అంటున్నారు. ముఖ్యంగా సినిమాలో సస్పెన్స్ హైలెట్ అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news