ఈ జబ్బులు చిన్నవి.. బాద పెద్దవి..!

-

ఎంటా అంత పెద్ద సమస్య అనుకుంటున్నారా. పెద్ద రోగం వస్తే డాక్టర్‌ని సంప్రదించి త్వరగానే తగ్గించుకుంటాం. కానీ చిన్న రోగాలు వస్తే వాటి నుంచి తప్పించుకోవడం బ్రహ్మతరం కూడా కాదు. అవే జలుబు, దగ్గు. చలికాలం పోయి ఎండలు మొదలైనాయి కదా అని సంతోషపడతారేమో. జలుబుకు ఎండా, వానా తేడాలేదు. వానల్లో చలి ఎక్కువై నెమ్ముచేస్తే, ఎండల్లో శరీరంలోని వేడి ఎక్కువై జులుబు స్టార్ట్‌ అవుతుంది. ఈ విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఫ్రెండ్స్‌, బంధువులు కనీళ్లు వస్తే తుడుస్తారు కాని జులుబు చేసినప్పుడు ముక్కు తుడవరు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సుమా! జులుబే కదా అని లైట్‌ తీసుకోకూడదు.

ఇది రెండు రోజుల్లో తగ్గితే పర్వాలేదు. అంతకు మించేతే.. అసలే స్వైన్‌ఫ్లూ, కరోనా అంటూ వైరస్‌లు వచ్చి చేరాయి. వాటి నుంచి ముందుగానే తప్పించుకోవాలంటే జలుబు వచ్చిందనే సూచనలు తెలియగానే వాటికి ప్రథమ చికిత్స చేసి జాగ్రత్త పడాలి. జులుబు, దగ్గు ఒకందుకు మేలే చేస్తుంది. శరీరంలోకి ప్రవేశించిన దుమ్ము, ధూళిని జలుబు, దగ్గు రూపంలో బయటకు పంపుతుంది. కాకపోతే రోజులకు మించి ఉంటే డాక్టర్‌ను సంప్రదించక తప్పదు.

జలుబుకు చికిత్స :

– ఏంటి దీనికి కూడా చికిత్స అనుకుంటారేమో.. శరీరానికి బారం అనిపించేది ఏది అయినా జబ్బే. దాన్ని పరిష్కరించుకునే పనిలో ఉండాలి.
– జులుబు చేసిన సమయంలో వేడినీటిని తాగడం మంచిది. దీంతో ఉపశమనం లభిస్తుంది.
– జలుబు త్వరగా తగ్గాలంటే వేడినీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగితే మంచిది.
– దాల్చిన చెక్క కలిపిన నీటిని తాగినా మెరుగైన ఫలితాలు ఉంటాయి.
– కర్పూరంతో ఆవిరి పట్టిస్తే జలుబు త్వరగా మాయమవుతుంది.
– రోజుకు మూడుసార్లు వేడినీటిలో ఉప్పు వేసుకొని పుక్కిలిస్తే కూడా జలుబు త్వరగా తగ్గుముఖం పడుతుంది.
– వెల్లుల్లి రెబ్బల వాసన పీల్చినా, నమిలి మింగినా జలుబు త్వరగా తగ్గిపోతుంది.

దగ్గుకు చికిత్స :

– క్యాబేజీ ఆకుల రసాన్ని రోజూ తాగితే దగ్గు తగ్గుతుంది.
– మిరియాలు, ధనియాలు, అల్లాన్ని కషాయంగా చేసుకొని తాగినా కూడా దగ్గు తగ్గుతుంది.
– రాత్రి పడుకునే ముందు ఒకటి లేదా రెండు స్పూన్ల తేనె తాగినా దగ్గు తగ్గుతుంది.
– తేనెను సొంటి కషాయంలో అల్లం కషాయంలో కలుపుకొని తాగినా కూడా దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.
– ఉమ్మెత్త ఆకులను ఎండించి చుట్టవలె చుట్టి పొగ తాగితే కూడా తగ్గుతుంది.
– గోరువెచ్చని నీళ్లలో అరటీస్పూన్‌ ఉప్పు, అర టీస్పూన్‌ పసుపు కలిపి తాగినా జలుబు తగ్గుతుంది.
– గ్లిజరిన్‌, తేనె, నిమ్మరసం కలుపుకొని తాగితే సరిపోతుంది.
– దగ్గు అదేపనిగా వదలకుండా ఉంటే మాత్రం పాలల్లో అర టీస్పూన్‌ పసుపుతోపాటు వెల్లుల్లి కలపడం మంచిది.
– నల్లమిరియాలు కషాయం తాగితే కూడా దగ్గు నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news