ఓరి దేవుడోయ్.. కేరళ వరదల్లో ఈ హీరోయిన్ ఇల్లు కూడా మునిగిపోయిందట..!

-

గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ కాస్త.. డివాస్టేటింగ్ కంట్రీ అయిపోయింది.ఎటు చూసినా.. కనుచూపు మేర నీళ్లే. గత పదిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కేరళ పూర్తిగా మునిగిపోయింది. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వందల మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీంలు వరదల్లో చిక్కుకున్న వారిని పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. కేరళ వరదల్లో నా ఇల్లు కూడా మునిగిపోయిందండోయ్ అంటూ ఫేస్ బుక్ లైవ్ లో తన గోడు వెళ్లబోసుకుంది ఓ హీరోయిన్. ఆమె ఎవరో కాదు జర్నీ సినిమా గుర్తుందా? ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన అనన్య. ఇప్పుడు గుర్తొచ్చిందా? పాపం.. తన ఇల్లు కూడా కేరళ వరదల్లో మునిగిపోతే ఏం చేయాలో తెలియక మరో నటి ఆశా ఇంట్లో తలదాచుకున్నదట.

ఫేస్ బుక్ లైవ్ లో అనన్య ఏం చెప్పిందంటే.. నా ఇల్లు పూర్తిగా మునిగింది. క్షణాల్లో వరద మా ఇంటి మీదికి వచ్చింది. దీంతో ఇల్లు మునిగిపోయింది. ఇంకా వర్షం పడుతూనే ఉన్నది. మాదే కాదు.. మా రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఇండ్లు కూడా మునిగిపోయాయి. దీంతో వేరేవాళ్ల ఇంటికి వచ్చి తలదాచుకోవాల్సి వచ్చింది. ఎప్పుడూ ఇటువంటి పరిస్థితులను అనుభవించలేదు. కేరళ వరద బాధితులకు సాయం చేయడానికి ముందుకు వస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.. అంటూ వీడియోను పోస్ట్ చేసింది అనన్య. చూశారుగా.. కేరళ భారీ వర్షాలకు సెలబ్రిటీలు కూడా ఎలా బెంబేలెత్తిపోతున్నారో? సెలబ్రిటీల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఓ మై గాడ్.. వాట్ ఈజ్ దిజ్.. ఇటువంటి విపత్తు ఇంకోసారి రాకుండా చూడు.

Read more RELATED
Recommended to you

Latest news