లైంగిక వేధింపుల కేసులో యశోద నటుడికి హైకోర్టు షాక్..!

-

మలయాళ యంగ్ హీరో యశోద ఫేమ్ ఉన్ని ముకుందన్ కు తాజాగా కేరళ రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. ఉన్ని ముకుందన్ పై ఇప్పటికే ఉన్న లైంగిక వేధింపుల కేసులో ఇచ్చిన స్టే ఆర్డర్ ను హైకోర్టు నిలిపివేసింది.. గతంలో ఉన్ని ముకుందన్ తో బాధితరాలు చేసుకున్న ఒప్పందానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో గతంలో ఇచ్చిన తీర్పును కొట్టిపారేసింది.. ఈ మేరకు ఇప్పుడు తాజాగా ఉత్తర్వులు జారీ చేస్తూ కేరళ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

అసలు విషయంలోకి వెళితే ఉన్ని ముకుందన్ పై గతంలో ఒక యువతి లైంగిక వేధింపుల కేసు పెట్టింది. యంగ్ హీరో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అని కేరళ రాష్ట్రంలోని కొట్టాయం పట్టణానికి చెందిన ఒక యువతి 2018లో పోలీసులు ఆశ్రయించగా.. తనను స్టోరీ డిస్కర్షన్ అని పిలిపించుకొని.. తనతో అసభ్యంగా ప్రవర్తించాడని.. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అంటూ తన ఫిర్యాదులో పేర్కొంది. ఇకపోతే ఈ కేసులో యంగ్ స్టార్ ఉన్ని ముకుందన్ తరఫున వివాదాల న్యాయమూర్తి సైబీ జోస్ కిడంగూర్ వాదించాడు. ఈ కేసు క్రమంలో బాదిత యువతి కోర్టు బయట కేసును పరిష్కరించేందుకు అంగీకరించినట్లుగా ఒక ఫోర్జరీ పత్రాన్ని కోర్టుకు సమర్పించాడు.

ఆ యువతి వేసిన లైంగిక వేధింపుల కేసును హైకోర్టు కొట్టి పారేసింది. దాంతో అప్పటితో ఆ కేసు ముగిసిపోయినట్టే అని అంతా భావించారు. కానీ తాజాగా ఆ కేసును ఓపెన్ చేసింది హైకోర్టు.. బాధిత యువతి హైకోర్టును ఆశ్రయించి తాను ఎలాంటి సంతకం చేయలేదు అని వాంగ్మూలం ఇచ్చింది. దీంతో తప్పుడు పత్రాలు చూపించి కేసును తప్పుదోవ పట్టించాలని చూసినందుకు లాయర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది కేరళ హైకోర్టు. అంతేకాదు దీనిపై సమాధానం చెప్పాలి అని ఈ కేసులో అఫిడవిట్ దాఖలు చేయాలని ఉన్ని ముకుందన్ ను ఆదేశిస్తూ ఈనెల 17 కి కేసును వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news