హిమ‌జ స్ట‌న్నింగ్ లుక్స్‌.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే

నీళి క‌ల్ల చిన్న‌ది.. క‌త్తిలాంటి చూపుల‌తో కుర్ర‌కారు మ‌తి పోగొడుతోంది. హాయ్, హ‌లో.. ఇట్స్ హిమ‌జ అంటూ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తోంది. బిగ్ బాస్ తో బాగా ఫేమ‌స్ అయిపోవ‌డంతో.. ఎక్క‌డా త‌గ్గ‌ట్లేదు. బిగ్ బాస్ కు ముందు కొన్ని సినిమాల్లో న‌టించింది. కానీ మంచి స్ట‌ఫ్ ఉన్న పాత్ర ప‌డ‌లేదు ఈ బ్యూటీకి. అయినా స‌రే ఎక్క‌డా త‌గ్గ‌కుండా త‌న ప్ర‌య‌త్నాలు చేస్తోంది.


అప్ప‌ట్లో బిగ్ బాస్ లో ర‌చ్చ చేసింది. రాహుల్ తో గొడ‌వ‌, ర‌వితో ప్రేమ అని గాసిప్స్ న‌డిచాయి. ఇక బిగ్‌బాస్ త‌ర్వాత కొన్ని ఈవెంట్లు, షోలు కూడా చేసింది. ఇది చాల‌దంటూ.. సినిమాల్లో హీరోయిన్ గా చేయ‌డానికి చాలా ప్ర‌య‌త్నాలే చేసింది. కానీ ఈ పిల్ల ప్ర‌య‌త్నాలు పెద్ద‌గా ఫ‌లించ‌లేదు.

అయినా నిరాశ ప‌డ‌కుండా.. నిత్యం సోష‌ల్ మీడియాలో త‌న హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ.. ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఇక ఈ ముద్దుగుమ్మ లేటెస్టుగా షేర్ చేసిన ఫొటోలు ఇన్ స్ట్రాగ్రామ్ లో ఇర‌గ‌దీస్తున్నాయి. స్ట‌న్నింగ్ లుక్స్ తో చంపేస్తోంది. మ‌రి ఆ ఫొటోల‌ను మీరు కూడా చూసేయండి.