హిట్టు సినిమాకు హీరో, విలన్ అవసరంలేదు

-

తెలుగు సినిమా అంటే ఒకప్పడు అవే కథలు.. అవే సెంటిమెంట్లు.. అవే ఫైటింగులు అన్నట్టుగా మాట్లాడుకునే వారు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. ఇండియన్ సినిమాల్లో తెలుగు సినిమాకు ప్రత్యేకమైన ఇమేజ్ వచ్చింది. సినిమా పుట్టుక సమయాల్లోనే మహామహులంతా తెలుగు సినిమా సత్తా చాటగా కమర్షియల్ పోకడలో వెళ్తున్న సినిమాకు మళ్లీ అడ్డుకట్ట వేసింది మాత్రం తెలుగు పరిశ్రమనే.

రొటీన్ కథ అది స్టార్ సినిమా అయినా సరే థియేటర్లు ఖాలీ అవుతున్నాయి. కంటెంట్ సినిమా ముక్కు మొహం తెలియని హీరో హీరోయిన్ అయినా సరే సినిమా హిట్ చేసేస్తున్నారు. ఈమధ్య కాలంలో తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా కొత్త దర్శకుల సత్తా చాటుతున్నారు. ఈ ఇయర్ కంటెంట్ ఉన్న సినిమా బడ్జెట్ తో సంబంధం లేకుండా బీభత్సం సృష్టిస్తున్నాయి.

అంతేకాదు హిట్టు సినిమాకు హీరో, విలన్ అవసరం లేదు అన్నట్టుగా ప్రూవ్ చేసింది లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ కేరాఫ్ కంచరపాలెం. ఈ సినిమా దర్శకుడు వెంకటేష్ మహా సినిమా తెరకెక్కించిన విధానం అందరిని ఆశ్చర్యపరచింది. సహజత్వం అంటే ఇదే అనేట్టుగా పాత్రలు పాత్రధారులు ఆకట్టుకునేలా చేశారు. రానా రిలీజ్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.

మహేష్ బాబు సైతం ఈ సినిమా గురించి గొప్పగా చెప్పాడంటే సినిమా ప్రభావం ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. కేరాఫ్ కంచరపాలెం అంతా కొత్త వారితో చేసిన సినిమా.. దర్శకుడు కొత్తవాడే.. అయినా సరే వాళ్లని వారు ప్రూవ్ చేసుకోవాలన్న కసి ఈరోజు వారిని నిలబెట్టింది. ఇలాంటి సినిమాలు ఇలాంటి ప్రయోగాలు సినిమా పరిశ్రమలో అడుగు పెట్టాలనుకునే ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తాయని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news