‘ సాహో ‘ ఎంత వసూలు చేస్తే సేఫ్..!

850

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ `బాహుబ‌లి` త‌ర్వాత ర‌న్ ర‌జా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోతున్న `సాహో` చిత్రంలో న‌టిస్తున్నాడు. దాదాపు 350 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్ర‌ద్ధా క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. యాక్ష‌న్ థిల్ల‌ర్‌గా రాబోతున్న ఈ చిత్రం ఇటీవ‌ల ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జ‌రుపుకుంది. ఈ సినిమా ఆగ‌ష్టు 30న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. జాకీ ఫ్రాఫ్, నీత్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే, మందిరా బేడి, అరుణ్ విజయ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.


తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళంలో ఒకే సారి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌బోతున్నారు. ఇక తాజాగా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రం వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 320 కోట్లకు అమ్మారు. నాన్ థియేట్రికల్ కలుపుకుని బిజినెస్ రేంజ్ 450-500 కోట్ల మేర సాగుతోంద‌ని అంటున్నారు. ఈ రేంజ్‌లోనే షేర్స్ రాబ‌ట్టాల‌ని ముందుగానే ప్లాన్ చేసుకంటున్నార‌ట‌. ఆరంభంలోనే హీట్ టాక్ తెచ్చుకుంటే భారీ క‌లెక్ష‌న్ల‌కు పెద్ద క‌ష్ట‌మేమి కాదు. అదే నెగ‌టీవ్ టాక్ వ‌స్తే మాత్రం వ‌సూళ్ల ప‌రంగా చాలా ఇబ్బంది ప‌డుతుంది.

భారీ యాక్ష‌న్ థిల్ల‌ర్‌గా తెర‌కెక్క‌బోయే ఈ చిత్రంపై అంచ‌నాలు ఓ రేంజ్‌లో నెల‌కొన్నాయి. ఈ క్ర‌మంలోనే భారీ స్థాయిలో ప్రీ టికెట్ బుక్కింగ్స్ జ‌రుగుతున్నాయి. విడుద‌ల టైం ద‌గ్గ‌ర ప‌డ‌తున్న వేళ‌ చిత్ర యూనిట్ టికెట్ రేటు పెంచ‌నుంద‌ని స‌మాచారం. అయితే కొన్ని అంచ‌నాలు ప్ర‌కారం సాహో బాహుబ‌లి ఫీట్‌ను రిపీట్ చేస్తుంద‌ని అంటున్నారు. మ‌రి ఎంత వ‌ర‌కు `సాహో` సంచ‌ల‌నం సృష్టిస్తుందో చూడాలి.