టీ పీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్‌రెడ్డి..!

-

దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న తెలంగాణలో ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. పార్టీలో ఎప్పుడు ఎవరు ఉంటారు… ఎప్పుడు ఎవరు ఇచ్చి బయటకి వెళ్ళిపోతారో కూడా అర్థం కావడం లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలు అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి వైపు చూస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. పార్టీలో మరో సీనియర్ నేత వి.హనుమంతరావు సైతం పార్టీ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి  దామోదర్ రాజనర్సింహ సైతం బిజెపి లోకి వెళ్ళిపోతారు అంటూ ప్రచారం జరుగుతోంది మరో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి సైతం బిజెపి వైపు చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి.


ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కడుతుందా ? అసలు ఆ పార్టీని కాపాడే నాయ‌కుడు ఎవరు ? అన్నదానిపై ప్రతి ఒక్కరికి సందేహాలు ఉన్నాయి. ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజా ఎన్నికల్లో నల్లగొండ నుంచి ఎంపీగా గెలిచారు. తెలంగాణలో రాహుల్ గాంధీ ఎంతో ?నమ్మకంతో ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించినా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేద‌న్న అసంతృప్తి ఉంది.

ఈ క్రమంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఈ ప‌ద‌వి నుంచి తప్పించి పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలని టీ పీసీసీ నేతల్లోనే అసమ్మతి స్వరాలు కొద్దిరోజులుగా వస్తున్నాయి. ఎట్టకేలకు టీ పీసీసీకి త్వరలోనే కొత్త అధ్యక్షుడు వస్తున్నట్టు తెలంగాణ రాజకీయ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్లు రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి మధ్య టీ పీసీసీసీ పీఠం కోసం పోటీ ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే ఇప్పుడున్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో తెలంగాణ  కాంగ్రెస్ కేడ‌ర్‌లో న‌మ్మ‌కం క‌లిగించాల‌న్నా ?  పార్టీని కాపాడాల‌న్నా ?  కేసీఆర్‌ను ఢీ కొట్టాల‌న్నా అది ఒక్క రేవంత్ వ‌ల్లే అవుతుంద‌న్న నిర్ణ‌యానికి రాహుల్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఒక‌వేళ ఏదైనా ప్లాన్ మారి జీవ‌న్‌రెడ్డికి తాత్కాలికంగా పార్టీ ప‌గ్గాలు ఇచ్చినా ఎన్నిక‌ల టైంకు తిరిగి రేవంత్‌కే పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు ఇస్తార‌ని అంటున్నారు. ఏదేమైనా తెలంగాణ‌లో సాధార‌ణ ప్ర‌జ‌లు సైతం టీపీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ ఉంటేనే అధికార ప‌క్షాన్ని బ‌లంగా ఢీకొట్ట‌డానికి మంచి వాయిస్‌గా ఉంటాడ‌ని భావిస్తున్న మాట నిజం.

Read more RELATED
Recommended to you

Latest news