Icon star : అదిరిపోతున్న పుష్ప రాజ్ యాడ్ వీడియో

-

icon స్టార్ వరుస‌గా టీవీల‌లో క‌నిపిస్తున్నాడు. అది ఇది అని తేడా లేకుండా ప్ర‌తి దానిలో క‌నిపిస్తున్నాడు. తాజాగా రాపిడో పై అల్లు అర్జున్ చేసిన విడీయో వైర‌ల్ అవుతుంది. ఈ యాడ్ లో icon స్టార్ అల్లు అర్జున్ దోశ మాస్టార్ గా క‌నిపిస్తున్నాడు. దోశ తినాలంటే రెండే అంటు డైలాగ్ చెబుతాడు. చివ‌ర‌గా దోశ తిన‌డానికి బ‌స్సుల‌లో ఇబ్బంది ప‌డేకంటే రాపిడో బైక్ బుక్ చేసుకుని సులువుగా దోశ తిని రావాల‌ని అంటాడు.

దీని ద్వారా ట్రాఫిక్ స‌మ‌స్య‌లు కూడా ఉండ‌వు అని icon స్టార్ అంటాడు. కాగ ఈ విడీయో లో పుష్ప రాజ్ లుక్ అదిరి పోయే లా ఉంది. నిండైన జుట్టు తో పాటు గ‌డ్డం లుక్ కూడా ఆక‌ట్టు కుంటుంది. అయితే అల్లు అర్జున్ ప్ర‌స్తుతం ప‌బ్లిసిటీ ఎక్కువ తెచ్చు కోవ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. వరుస‌గా ఆడియో రిలిజ్ ఈవెంట్ తో పాటు ప‌లు ఈవెంటు ల‌కు అతిథిగా హాజ‌ర‌వుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news