నా భర్తకు మూడో పెళ్లి అయితే.? నేను ఏం వర్జిన్ కాదుగా…?

-

సిని పరిశ్రమలో మనం ఎన్నో వింతలు చూస్తూ ఉంటాం. చిన్నప్పుడు ఎత్తుకుని ఆడించిన చిన్న పిల్లలను స్టార్ హీరోలు పెళ్ళిళ్ళు చేసుకోవడం కూడా మనం చూసాం. ఇక రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. రెండో పెళ్లి చేసుకున్న వాళ్ళను మొదటి పెళ్లి చేసుకున్న హీరోయిన్లు, మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న హీరోయిన్లు మనకు ఎక్కువగా కనపడతారు.

ఈ కోవకే చెందుతుంది బాలివుడ్ నటి నేహా పెండ్సే. నేహా ముంబయికి చెందిన వ్యాపారవేత్త శార్దూల్‌ను పెళ్లి చేసుకున్నారు. అయితే శార్దూల్‌కు అప్పటికే రెండు సార్లు పెళ్లై విడాకులు తీసుకున్నాడు. అయినా సరే ఆమె అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దీనిపై స్పందిన నేహా, “నేను ప్రేమించిన వారంతా పెళ్లి అనేసరికి తప్పించుకున్నారు కానీ, శార్దూల్ అలాంటి వ్యక్తి కాదు. రెండు సార్లు పెళ్లి విషయంలో విఫలమైనప్పటికీ అతనికి ఇంకా వైవాహిక జీవితంపై నమ్మకం ఉంది.

అందుకే నేను శార్దూల్‌కు సెల్యూట్ చేస్తున్నాను.” అని చెప్పుకొచ్చింది. అక్కడితో ఆగకుండా, “భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోతే విడిపోవడమే మంచిది. ఆయనకు ఇది మూడో పెళ్లైతే ఏంటి? ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు మీకు వచ్చిన సమస్యేంటి? రెండో పెళ్లి కూడా చేసుకుని విడిపోయిన వాడితో పెళ్లేంటి అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఆ రకంగా చూసుకుంటే నేను కూడా వర్జిన్ కాదు కదా అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news