కాజల్ కాకపోతేనే అనుష్క నా.. క్రేజ్ ఇలా తగ్గిందేంటి ..?

-

కాజల్ అగర్వాల్, అనుష్క శెట్టి … ఈ ఇద్దరు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకొచ్చి దాదాపు 13 ఏళ్ళు కావస్తుంది. అయితే క్రేజ్ పరంగా ఇద్దరిది ఒకే రేంజ్ అని చెప్పాలి. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలంటే మేకర్స్ కి ఫస్ట్ ఛాయిస్ అనుష్క నే. అలాగే కొన్ని కమర్షియల్ సినిమాలంటే ఖచ్చితంగా కాజల్ కావాల్సిందే. ఇలా టాలీవుడ్ లో ఇద్దరు సక్సస్ ఫుల్ జర్నీ ని కొనసాగిస్తున్నారు.

 

ఇక ప్రస్తుతం అనుష్క నిశబ్ధం అనే పాన్ ఇండియా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీలలో రిలీజ్ చేసేందుకు సిద్దంగా ఉన్నారు. వాస్తవంగా అయితే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కాని లాక్ డౌన్ కారణంగా ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నది క్లారిటి లేదు. అయితే ఈ సినిమా తర్వాత అనుష్క చేసే సినిమా విషయంలో ఎలాంటి అప్‌డేట్ లేదు. ఇంకా చెప్పాలంటే తన చేతిలో ఒక్క సినిమా కూడా లేదని తెలుస్తుంది.

అయితే తాజా సమాచారం ప్రకారం అనుష్క యాక్షన్ హీరో గోపీచంద్ నటించబోయో సినిమాలో సెలెక్ట్ అయిందట.‌ తేజ దర్శకత్వంలో ‘అలిమేలుమంగ వేంకటరమణ’ పేరుతో ఒక రూపొందనున్న సంగతి తెలిసిందే. అయితే అలిమేలు మంగ పాత్రలో ఎవరు నటిస్తున్నాన్నది ఇప్పటి వరకు సస్పెన్స్ గా ఉండింది. వాస్తవంగా ఈ సినిమా కోసం ముందుగా తేజ .. కాజల్ ని అనుకున్నారట. అయితే ప్రస్తుతం కాజల్‌ ‘మోసగాళ్లు’, ‘ఆచార్య’, ‘ముంబయి సాగా’, ‘భారతీయుడు2’ సినిమాలు కమిటయింది. దాంతో ఇప్పుడు తేజ అనుష్క ని సెలెక్ట్ చేసుకున్నాడని తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన అధికారక ప్రకటన త్వరలో రానుంది. అయితే కాజల్ బిజీగా ఉండటంతోనే తేజ అనుష్క ని అనుకుంటున్నాడని లేదంటే కాజల్ నే తీసుకునే వాడని మాట్లాడుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news