రష్మికా నీ బాయ్ ఫ్రెండ్ను తరిమేసినట్టే నిన్ను కూడా బాలీవుడ్ నుండి పంపేస్తాం.. కమల్ ఆర్ ఖాన్

-

ప్రస్తుతం బాలీవుడ్ లో సెల్ఫ్ ఐడెంటిఫైడ్ క్రిటిక్‌గా చెలామణి అవుతున్న కమల్ ఆర్ ఖాన్‌ చాలావరకు సెలబ్రిటీలను వ్యక్తిగతంగా విమర్శించడానికి ముందు వరసలో ఉంటాడు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను తన మాటలతో.. ట్వీట్లతో టార్గెట్ చేస్తూ వస్తున్న కమల్ తాజాగా హీరోయిన్ రష్మిక మందనను టార్గెట్ చేశాడు..

హీరోయిన్ రష్మికపై బీటౌన్‌లో మూవీ క్రిటిక్‌గా చెప్పుకునే కమల్ ఆర్ ఖాన్ నెగెటివ్ కామెంట్స్ చేశాడు.
కేఆర్‌కే తన ట్విట్టర్లో రాష్మిక ను టార్గెట్ చేశాడు అంతేకాకుండా రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వైఫల్యం చెందటాన్ని ఎగతాళి చేశాడు.. అంతేకాకుండా రష్మికను హిందీ ప్రేక్షకులు ఆదరించాలని త్వరలోనే బాలీవుడ్ నుంచి వెళ్లిపోవలసి వస్తుందని అన్నాడు అంతేకాకుండా రష్మికను తెలుగు తమిళ కన్నడ భాషల్లో కాకుండా భోజ్పురి చిత్రాల్లో చూడటమే కరెక్ట్ అంటూ చెప్పుకొచ్చాడు..

అలాగే ట్వీట్ లో “మేడమ్ రష్మిక మందన జీ.. మా హిందీ ప్రేక్షకులు మీ బాయ్‌ఫ్రెండ్ అనకొండ సినిమా లైగర్‌ను రిజెక్ట్ చేసి అతన్ని బాలీవుడ్ నుంచి ఎలాగైతే తరిమికొట్టారో.. సరిగ్గా నీకు కూడా అలాగే చేయబోతున్నాం. కానీ మిమ్మల్ని భోజ్‌పురి చిత్రాల్లో చూడటం మాకు ఆనందంగా ఉంటుంది.. ” అని పోస్ట్ చేశాడు.. అయితే ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. దీనిపై పలువురు అమలులో దుమ్మెత్తి పోస్తున్నారు అంతేకాకుండా రష్మిక, విజయ్ దేవరకొండకు మద్దతుగా నిలిచి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు..

కమల్ ఇప్పటికే పలువురిని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో తాజాగా బ్రహ్మస్త్ర సినిమాని కూడా గత కొన్ని రోజుల క్రితం టార్గెట్ చేశారు.. ఈ సినిమాను నిర్మించి కరణ్ జోహార్ ఎంతగానో నష్టపోయారని.. ఆ నష్టాలు పోటీ లేక ఆత్మహత్య కూడా చేసుకుందామని అనుకున్నారు అంటూ చెప్పకు వచ్చారు ఈ విషయం కూడా అప్పట్లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే..

Read more RELATED
Recommended to you

Latest news