తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు సైతం అవకాశాలు లేక చాలా ఇబ్బందిలు ఎదుర్కొన్న సందర్భాలు చాలానే ఉన్నాయని ఎంతోమంది నటీనటులు తెలియజేస్తూ ఉన్నారు. మరి కొంతమంది ఆర్థిక పరిస్థితి బాగాలేక రోడ్డు మీద పడిన సంఘటనలను కూడా మనం తరచూ వింటూనే ఉన్నాము. ఇలా ఇప్పటికే ఎంతోమంది నటీనటులు సైతం మీడియా ముందుకు వచ్చి తమ స్థితి గురించి ఆవేదన చెందిన ఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా మరొక నటి కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆమె ఎవరు వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఆమె ఎవరో కాదు అలనాటి సినిమాలలో నటించిన నటి పాకీజా. ఒకప్పుడు కామెడీయన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె డేట్ల కోసం అప్పట్లో ఎంత మంది దర్శక, నిర్మాతలు క్యూ కట్టేవారట. అంతలా వరుస సినిమాలతో షూటింగులతో బిజీగా ఉండేదట పాకీజా. ఇక మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ సినిమాలో ఈమె నటించడంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది పాకీజా. అటు తరువాత బ్రహ్మానందంతో కలిసి పలు చిత్రాలలో నటించి కామెడీతో ప్రేక్షకులను బాగా నవ్వించింది. అలా పాకీజా కెరియర్ లో రౌడీ ఇన్స్పెక్టర్ పెదరాయుడు వంటి చిత్రాలలో నటించి మెప్పించింది.
దాదాపుగా పాకీజా తెలుగులోనే 50కు పైగా సినిమాలలో నటించింది. అయితే ప్రస్తుతం ఇమే పరిస్థితి చాలా దయనీయంగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలు మానేశాక తన సొంత ఊరు కారైకుడికి వెళ్లిపోయిందట. అయితే ఇన్ని సినిమాలలో నటించిన పాకేజాకు ఇప్పటివరకు సొంత ఇల్లు కూడా లేదని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేస్తోంది. తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని సహాయం చేయాలని చాలామంది సినిమా వాళ్ళను అడిగానని కానీ ఎవరూ కూడా కనికరించలేదని ఆమె కన్నీరు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళంలో దాదాపుగా 150 కు పైగా సినిమాలలో చేసింది పాకీజా. సహాయం కోసం తమిళ్ నడిగర్ సంఘంతో పాటు, ఉదయనిది స్టాలిన్ ని కూడా అడిగిన ఎవ్వరు సహాయం చేయలేదని తెలియజేస్తోంది.