టిక్కెట్‌ రేట్లు పెంచితే.. అసలుకే మోసం వస్తుందా ?

Join Our COmmunity

తెలంగాణ సి.ఎం కెసిఆర్‌ సినిమా ఇండస్ట్రీపై ప్రకటించిన వరాల జల్లు హీరోల్లో.. నిర్మాతల్లో కదలిక తీసుకొచ్చింది. సంక్రాంతికి వద్దామా లేదా అని సెంకడ్‌ థాట్‌లో వున్ననిర్మాతలు ముందడుగు వేయడానికి రెడీ అవుతున్నారు. సమ్మర్‌కు వెళ్లిపోయిన పెద్ద సినిమా నిర్మాత మళ్లీ సంక్రాంతిపై కన్నేశాడు. ముఖ్యమంత్రి ప్రకటించిన రాయతీలు సినిమా రిలీజ్‌స్‌పై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి…

కెసిఆర్‌ ప్రకటించిన రాయితీలన్నీ ఒక ఎత్తయితే.. రిలీజ్‌ సమయంలో థియేటర్స్‌ సంఖ్య.. టిక్కెట్‌ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించడంతో హీరోల.. నిర్మాతల మైండ్‌ సెట్‌ మారిపోయింది. మరోవైపు థియేటర్స్‌ ఓపెన్‌ చేసుకునే పర్మిషన్‌ కూడా వచ్చేసింది. షూటింగ్ పూర్తిచేసుకున్న చాలా సినిమాలు రిలీజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాయి. ప్రేక్షకులు థియేటర్‌లో వస్తారా? లేదా? అని డైలమాలో పడిన వారికి సిఎం వరాలతో కొత్త ఆశలు చిగురించాయి.

ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీతో థియేటర్స్‌ నడపడం మా వల్లకాదని ఎగ్జిబిటర్లు చేతులెత్తేశారు. పెద్ద హీరో.. మీడియం బడ్జెట్‌ మూవీస్‌కు ఇది వర్కవుట్ కాదని.. డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్‌ గురించి ఆలోచించడం మానేశారు. చిన్న చిత్రాలేమో.. ఓటీటీలను ఆశ్రయిస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన తాజా జీఓలోనూ ఫిఫ్టీ పర్సెంట్‌ ఆక్యుపెన్సీతో మాత్రమే రిలీజ్‌ చేయాలన్న నిబంధన విధించింది. ఇది నిర్మాతలకు.. డిస్ట్రిబ్యూటర్స్‌కు ఇబ్బందికరమే అయినా.. టిక్కెట్‌ రేట్లు.. థియేటర్స్ సంఖ్య పెంచుకునే వెసులుబాటుతో… ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీని అధిగమించవచ్చన్న ధీమా నిర్మాతల్లో కలిగింది.

2021 సంక్రాంతికి వచ్చేది అందరూ యంగ్ హీరోలే. రామ్‌ రెడ్‌ మూవీతో.. అఖిల్‌ ‘మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచులర్‌’గా వస్తున్నాడు. రానా ‘అరణ్య’ మూవీ కూడా వస్తోంది. సినిమా టిక్కెట్‌ రేటు పెంచుకునే అవకాశం లేనప్పుడు సంక్రాంతికి రావడానికి రామ్‌ భయపడ్డాడు. సంక్రాంతికి వచ్చేది లేనిది ఫిఫ్టీ ఫిప్టీగా వుండేది. కొత్తగా వచ్చిన జీఓతో రెడ్‌కు గ్రీన్‌ పడింది. సమ్మర్‌కు వెళ్లిపోయాడనుకున్న వకీల్‌సాబ్‌ విడుదల విషయంలో మరోసారి ఆలోచిస్తున్నారు నిర్మాత దిల్‌ రాజు. డిసెంబర్‌ మొదటివారంలో షూటింగ్‌ పూర్తవుతుంది. సమ్మర్‌వరకు నాలుగు నెలలు వెయిట్‌ చేయకుండా.. సంక్రాంతికి వచ్చేదమన్న ఆలోచన వకీల్‌సాబ్‌ యూనిట్‌లో మొదలైంది.

మొత్తానికి టిక్కెట్‌ రేట్లు పెంచుకునే వెసులుబాటు రిలీజెస్‌పై పడింది. ఈ ఎనౌన్స్‌మెంట్ రాకముందే.. సాయిధరమ్‌తేజ్ ‘సోలో బతుకే సో బెటర్‌’ను డిసెంబర్‌లో రిలీజ్‌ చేస్తామని నిర్మాత ఎనౌన్స్‌ చేశారు. థియేటర్స్ ఓపెన్‌ తర్వాత రిలీజ్‌ అయ్యే తొలి క్రేజీ మూవీ ఇదే కావచ్చు. ఇంకా విడుదల తేదీ ప్రకటించకపోయినా.. డిసెంబర్‌ రావడం గ్యారెంటీ. సంక్రాంతి రేసులో దిగుదామా? వద్దా? అని సందిగ్దంలో వున్న సినిమాలు రావాలంటే.. తెలంగాణ గవర్నమెంట్ జీఓ ఒక్కటే సరిపోతు.. మరో తెలుగు రాష్ట్రంఆంధ్రప్రదేశ్‌ నుంచి సానుకూల స్పందన వస్తేనే.. ముఖ్యంగా థియేటర్స్‌ సంఖ్య.. టిక్కెట్‌ రేట్లు పెంచుకునే అవకాశం కల్పిస్తేనే.. హీరోలు.. నిర్మాతల్లో కదలిక వస్తుంది. థియేటర్స్‌లో బొమ్మ పడుతుంది.

TOP STORIES

డేల్యూజనల్ డిజార్డర్ అంటే ఏమిటి.. లక్షణాలు.. కారణాలు.. నయం చేసే వీలు..

చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.. కన్న కూతుళ్ళనే పొట్టన పెట్టుకున్న తల్లితండ్రుల మానసిక వైకల్యం గురించి చర్చ జరుగుతుంది....
manalokam telugu latest news