బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కండల వీరుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా.. సుమారు 50 సంవత్సరాల వయసు పైబడిన అప్పటికీ సల్మాన్ ఖాన్ ఇంకా వివాహం చేసుకోకపోవడానికి గల కారణాలు ఎన్నో ఉన్నాయి ఇకపోతే గతంలో విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ ను ప్రేమించి.. తన చేజేతులారా ఐశ్వర్యరాయ్ ప్రేమను పోగొట్టుకున్నాడు సల్మాన్ ఖాన్. ఇక ఆ తర్వాత మరెంతో మంది హీరోయిన్లతో ఈయన చాలా చనువుగా కనిపించే వాడు. అంతే కాదు ఎంతో మంది హీరోయిన్లకు ఖరీదైన వస్తువులను కూడా బహుమతిగా ఇచ్చారు.
ఇకపోతే సల్మాన్ ఖాన్ నుంచి ఏకంగా కోట్ల రూపాయల విలువ చేసే బహుమతులను అందుకున్న హీరోయిన్లు కూడా చాలామంది ఉన్నారు. ఇకపోతే సల్మాన్ఖాన్కి కేవలం బాలీవుడ్లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా మంచి ఇమేజ్ ఉంది ప్రస్తుతం ఆయన చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు చిరంజీవి మీద ఉన్న అభిమానంతోనే ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోకుండా సల్మాన్ ఖాన్ నటిస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కి ఉన్న ఒక చెడ్డ అలవాటు గురించి సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.
అదేమిటంటే సల్మాన్ ఖాన్ ఎక్కడికైనా వెళ్లినప్పుడు తనకు ఏదైనా ఒక కొత్తరకం సబ్బు కనిపిస్తే వెంటనే బ్యాగ్ లోకి వేసుకుంటారు కూడా.. ఇదేంటయ్యా అని అడిగితే షవర్ ఎక్స్పరిమెంట్ అని చెబుతూ ఉంటారట..ఇక ఆయన ఎప్పుడు ఎక్కడ అయినా సరే ఒక కొత్తరకం సబ్బు కనిపించిందంటే వెంటనే తన బ్యాగ్లో వేసుకునే ఒక చెడ్డ అలవాటు సల్మాన్ ఖాన్ కి ఉందని.. అంతేకాదు ఆ సబ్బుతో షవర్ ఎక్స్పీరియన్స్ పొందుతాడు అని ఈయన పైన ఒక బ్యాడ్ రూమర్ స్ప్రెడ్ అవడం గమనార్హం.