2011-12 నాటి నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీకి ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు అందజేసింది. అయితే జూన్ 2వ తేదీనే ఈడీ ఎదుట హాజరు కావాలని కోరగా రాహుల్ గాందీ విదేశాలలో ఉన్నందున హాజరు కాలేదు. కగా నేడు (జూన్ 13)న ఈడీ ముందుకు రాహుల్ గాంధీ హాజరుకానుండగా.. 23వ తేదీన సోనియాగాంధీ ఈడీ ముందుకు వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే నేడు దేశ వ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీకి కాంగ్రెస్ అగ్ర నాయకులు, పార్లమెంట్ సభ్యులు, సిడబ్ల్యూసి మెంబర్లు, మద్దతు తెలుపుతూ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తమ నేతకు మద్దతుగా జరగనున్న ర్యాలీలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొనబోతున్నారు.