చమ్మక్ చంద్ర పడ్డ కష్టాలు తెలిస్తే..షాక్..!!

-

తెలుగు సినీ ప్రేక్షకులకు బుల్లితెర ప్రేక్షకులకు చమ్మక్ చంద్ర అంటే పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. ఎక్కువగా ఫ్యామిలీ స్కిట్లను చేస్తూ ప్రేక్షకులను బాగా నవ్విస్తూ ఉంటాడు. ఇక మరొకవైపు కొన్ని సినిమాలలో సైడ్ ఆర్టిస్టుగా, జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా ఎన్నో సినిమాలలో నటించారు. కానీ చమ్మక్ చంద్ర కు ఎక్కువగా జబర్దస్త్ స్టేజ్ మీద మంచి గుర్తింపు లభించింది. అలా జబర్దస్త్ లో నాగబాబు ప్రియమైన శిష్యుడుగా కూడా పేరు పొందాడు.Chammak Chandra Phone Number, House Address, Email Id, Contact Address, Whats App Number In 2022

అలా బుల్లితెరపై తన క్రేజ్ తోనే చమ్మక్ చంద్ర సినిమాలలో నటిస్తూ ఉన్నారు. అయితే జబర్దస్త్ నాగబాబు ఎప్పుడైతే వదిలేసారో ఆ సమయంలోనే చంద్ర కూడా బయటకు వెళ్లి నాగబాబుతో కలిసి అదిరింది, బొమ్మ అదిరింది వంటి షోలలో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం చమ్మక్ చంద్ర ఎక్కువగా సినిమాలను నటిస్తూ ఉన్నాడు. సినిమాలలో కూడా పలు కమెడియన్ రోల్స్ లో చంద్ర అదరగొడుతున్నారని చెప్పవచ్చు. అయితే చమ్మక్ చంద్ర ఇలాంటి పొజిషన్ రావడానికి ఎంత కష్టపడ్డాడో ఇప్పుడు తెలుసుకుందాం.jabardasth chammak chandra most emotional comments about his life struggle, chammak chandra, most emotional, struggles, brahanandam, chammak chandra life struggles, jabardasht dhanraj, chiranjeevi, babumohaan, brahmanandam, tollywood, chammak chandra ...

చమ్మక్ చంద్ర ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్నప్పుడు తన దగ్గర డబ్బులు లేని పరిస్థితుల్లో తన బాబాయి దగ్గర రూ.2000 వేల రూపాయలు అప్పుగా తీసుకువచ్చి ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు. ఇన్స్టిట్యూట్ లో చంద్రకు ధనరాజ్ పరిచయమయ్యారు. ఇక వీరిద్దరూ కూడా అదే ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ నేర్చుకున్నారు. అలా యాక్టింగ్ నేర్చుకొని బయటికి వచ్చిన చంద్ర తన స్నేహితులతో కలిసి ఒక రూములో ఉండేవారు. అయితే రెండు నెలల తర్వాత రూమ్ రెంట్ కట్టడానికి తన దగ్గర డబ్బులు లేకపోవడంతో ఆ రూమ్ నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత యాక్టర్ విజయ్ దగ్గర వంటలు చేసుకుంటూ.. తనతో పాటు సినిమా షూటింగ్ కు వెళ్లేవారు. అయితే ఆ తర్వాత బయటకు వచ్చి చిన్నపిల్లలకు డాన్సింగ్ స్కూల్ ప్రారంభించాడు. అలా వచ్చిన డబ్బులతో తన జీవనోపాధి చేస్తూ ఉండేవాడు ఒక్కోసారి డబ్బులు లేక పస్తులు ఉన్న రోజులు కూడా ఉన్నాయట. అయితే ఇండస్ట్రీలో సినిమా అవకాశాల కోసం ఎంత తిరిగినా కూడా అవకాశాలు రాలేదట. దీంతో తన తల్లిదండ్రులు ఇంటికి రమ్మని పిలిచారట..ఇక అలాంటి సమయంలో ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో చమ్మక్ చంద్ర తన డైలాగులతో బాగా ఆకట్టుకున్నాడు. అలాంటి సమయంలో మల్లెమాల సమస్త వారు జబర్దస్త్ ప్రోగ్రామ్ ను మొదలుపెట్టారు. ఇందులో 6 వ టీం లీడర్ గా ఇందులో చమ్మక్ చంద్ర కు జబర్దస్త్ వారు అవకాశం ఇచ్చారు. ఇక ఆ తరువాత ఈ షో ద్వారా వెనక్కి తిరిగి చూసుకోలేదు చమ్మక్ చంద్ర. అలా ప్రస్తుతం ఇప్పుడు సినిమాలలో పలు షో లతో చాలా బిజీగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news