ఎన్టీఆర్ ధరించిన వాచ్ ధర తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!

-

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వరుస సినిమాలు ప్రకటిస్తూ మరింత బిజీగా మారిపోయిన ఎన్టీఆర్ తాజాగా తన సోదరి సుహాసిని కుమారుడి పెళ్లిలో పాల్గొని పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక ఈ పెళ్లి వేడుకకు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, మోక్షజ్ఞ ముగ్గురు కలిసి ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ గా మారగా.. ఆ ఫోటోలో ఎన్టీఆర్ చేతికి ఉన్న వాచ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Patek Philippe అనే కంపెనీకి చెందిన వాచ్ ఇది.. ఇది చాలా అల్ట్రా స్టైలిష్ లుక్ తో కనిపిస్తోంది. ఇక దీని విలువ అక్షరాలా రూ.2.45 కోట్లు.. దీని ధర చూసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే ఇలాంటి వాచ్ లు ఎన్టీఆర్ వద్ద చాలానే ఉన్నాయట. ముఖ్యంగా గతంలో కూడా ఎన్టీఆర్ ధరించిన వాచ్ ధరలు నెట్టింట చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఒక్కో సినిమాకి కోట్ల రేంజ్ లో పారిపోషకం తీసుకునే ఎన్టీఆర్ ఈ మాత్రం ఖరీదు వాచ్ లు ధరించడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. మరొకవైపు మేనల్లుడు పెళ్లి కావడంతో అంతా తానై దగ్గరుండి చూసుకున్న ఎన్టీఆర్.. తన అన్న కళ్యాణ్ రామ్, సోదరుడు మోక్షజ్ఞతో కలిసి దిగిన ఫోటోలను నెట్టింట షేర్ చేయడంతో ఆ ఫోటోలు కాస్త చాలా వైరల్ గా మారుతున్నాయి.

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా దేవర అనే సినిమాను చేస్తున్నారు ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకోగా.. వచ్చే యేడాది ఏప్రిల్ నెలలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news