కోలీవుడ్ కమెడియన్ యోగి బాబు పారితోషకం తెలిస్తే షాక్..!

-

కోలీవుడ్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న యోగి బాబు స్టార్ హీరోల సినిమాలలో ఎక్కువగా నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఆయన కోసమే కథలో ఒక కామెడీ ట్రాక్ కూడా దర్శకులు రాస్తూ ఉంటారు. అలా దళపతి విజయ్ నటిస్తున్న సినిమాలలో ఎక్కువగా అవకాశాలు దక్కించుకునే యోగిబాబు తాజాగా అందుకుంటున్న పారితోషకం తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే. 2009లో స్టార్ కమెడియన్ గా భారీ పాపులారిటీ అందుకున్న యోగి బాబు ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి.. అలా తన అద్భుతమైన కామెడీతో ప్రేక్షకులను మెప్పించిన ఈయన తెలుగు, తమిళ్ ప్రేక్షకులకు బాగా సుపరిచితుడుగా మారారు.

ముఖ్యంగా శివ కార్తికేయన్ హీరోగా నటించిన డాక్టర్ వరుణ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఈయన.. ఈ సినిమాలో ఆయన చేసిన కామెడీ థియేటర్స్ లో నవ్వులు పువ్వులు పూయించింది. రీసెంట్గా వచ్చిన లవ్ టు డే సినిమాలో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే భారీ లభించడంతో పారితోషకం కూడా పెంచేశారు యోగిబాబు. కొంతమంది హీరోలు అందుకునే రేంజ్ లో పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం.

యోగి బాబు ఒక్కొక్క రోజుకు రూ.18 లక్షల వరకు అందుకుంటారని సమాచారం. ఇక రోజుకు రూ .18 లక్షల అంటే సినిమా దాదాపు పూర్తయ్యే సరికి ఆయన రూ.10 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే కోలీవుడ్ లో కూడా కొంతమంది హీరోలకు సమానం అని చెబుతున్నారు ఇండస్ట్రీ నిపుణులు. ఏది ఏమైనా యోగి బాబు పారితోషకం ఇప్పుడు వైరల్ గా మారుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news