టాలీవుడ్ లో ఆఫర్లు రావాలంటే అలా చేయక తప్పదు.. మాళవిక నాయర్..!

టాలీవుడ్లో యాక్టింగ్ తో పాటు గ్లామర్ బాగుంటేనే హీరోయిన్గా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. రీసెంట్గా ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాలో హీరోయిన్గా నటించిన మాళవిక నాయర్ కూడా మరొకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. వాస్తవానికి టాలీవుడ్ లో చాలామంది హీరోయిన్లు వస్తూ ఉంటారు.. పోతూ ఉంటారు.. నాలుగైదు సినిమాలలో నటించిన తర్వాత ఫెడవుట్ అవుతూ ఉంటారు . ఎంట్రీ లోనే పెద్ద హీరో లేదా భారీ బడ్జెట్ మూవీతో తెరంగేట్రం చేసి ఆ తర్వాత వరుస సినిమాలతో స్టార్ ఇమేజ్ ను అనుభవిస్తూ ఉంటారు.

ఇక తాజాగా మలయాల నటి అయినప్పటికీ ముఖ కవళికలు చూస్తే అచ్చు తెలుగమ్మాయిలా ఉంటుంది మాళవిక నాయర్ .. అందుకే తెలుగు, తమిళ్, మలయాళం మూడు భాషల్లో కలిపి పట్టుమని 16 సినిమాల్లో నటిస్తే అందులో 10 సినిమాలలో తెలుగులోనే నటించింది. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈమె నాచురల్ స్టార్ నాని పక్కన హీరోయిన్గా నటించింది. ఇదే సినిమాలో మాళవిక నాయర్ తో పాటు విజయ్ దేవరకొండ కూడా నటించాడు. ఈ సినిమా హిట్ కాకపోవడంతో అటు ఇద్దరికీ కూడా గుర్తింపు రాలేదు.

ఆ తర్వాత నందిని రెడ్డి డైరెక్షన్లో కల్యాణ వైభోగమే సినిమాలో హీరోయిన్గా నటించి మంచి మార్కులు వేసుకుంది. ఆ తర్వాత చిన్న పాత్రలోను ఒప్పుకోవడం.. అవి కాస్త ఫ్లాప్ కావడంతో మళ్లీ మాయమయ్యింది. అయితే ఇప్పుడు హాట్ స్టిల్స్ ఇస్తూ ఫోటోషూట్ చేసింది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. ఆశించిన స్థాయిలో అవకాశాలు రావాలి అంటే బోల్డుగా గ్లామర్ షో చేయాల్సిందే అంటూ హాట్ కామెంట్లు చేసింది. ఏది ఏమైనా ఈమెకు తెలుగులో అవకాశాలు రావాలని ఇలా వరుసగా గ్లామర్ ఫోటోషూట్ చేస్తున్నానని తెలిపింది. మరి ఇలాగైనా ఈమెకు అవకాశాలు వస్తాయేమో చూడాలి.