Ileana DCruz : భర్తను పరిచయం చేసిన ఇలియానా..!

-

టాలీవుడ్ హీరోయిన్ ఇలియానా స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.. ఆ స్టార్ డం తోనే బాలీవుడ్లోకి వెళ్లి ఫెయిల్యూర్ హీరోయిన్గా మిగిలిపోయింది. అవకాశాలు తగ్గ ముఖం పట్టడంతో ఈ ముద్దుగుమ్మ గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రకారులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఇలియానా ప్రస్తుతం గర్భవతిగా ఉన్నట్లు తెలియజేసే అందరికీ షాక్ ఇచ్చింది. గత కొద్ది రోజులుగా బేబీ బంప్స్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తోంది ఇలియానా.

అయితే,  త్వరలోనే తల్లి కాబోతున్న గోవా బ్యూటీ ఇలియానా ఇన్ స్టాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. కుక్కపిల్ల ఫోటోను షేర్ చేసిన ఇలియానా… దానికి ఓ వ్యక్తి ముద్దు పెడుతున్న ఫోటోను సైతం పంచుకుంది. ఆ ఫోటోలో అతని ముఖం కనిపించకుండా జాగ్రత్త పడగా… అతనే ఇలియానాకు కాబోయే భర్త అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అతను ఎవరనే సస్పెన్స్ వీడాలంటే ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news