స్టోక్స్ సెంచరీ వృధా.. యాషెస్ సిరీస్‌ లో ఆసీస్‌ మరో విజయం

-

స్టోక్స్ సెంచరీ వృధా అయింది. దీంతో యాషెస్ సిరీస్‌ లో ఆసీస్‌ మరో విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన రెండో టెస్టులో 43 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. మొత్తం ఐదు టెస్ట్ మ్యాచుల యాషెస్ సిరీస్ లో వరుసగా రెండు మ్యాచ్ లలో ఇంగ్లాండ్ ఓడిపోవడంతో ఆస్ట్రేలియా 2-0 ఆదిక్యంలోకి దూసుకెళ్లింది.

రెండో టెస్టు చివరి రోజు ఆటలో కెప్టెన్ బెన్ స్టోక్స్ అద్భుత ఇన్నింగ్స్ ఆడినప్పటికీ ఇంగ్లాండ్ జట్టు ఆసీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేదించలేకపోయింది. రెండో టెస్టులో టాస్ ఓడి తోలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 416 పరుగులు చేసింది. ఆ తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లాండ్ జట్టు 325 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 91 పరుగుల ఆదిక్యంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 279 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంలో పరుగులతో కలిపి ఇంగ్లాండ్ జట్టుకో 371 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ నిర్దేశించింది. కానీ ఆ లక్ష్యాన్ని చేదించలేకపోయింది ఇంగ్లాండ్.

Read more RELATED
Recommended to you

Latest news