2020 లో 2020 ఆడబోతున్న తమన్నా .. ఫుల్ స్వింగ్ లో స్వింగ్ జరా ..!

-

ఒకప్పుడు హీరోయిన్ కి సినిమాలలో డిమాండ్ తగ్గాకనో లేదా ఫేడవుట్ అయ్యాకనో మళ్ళీ స్ర్కీన్ మీద కనిపించడానికి అంతగా ఆస్కారం ఉండేది కాదు. పెళ్ళి చేసుకొని ఇంట్లో కూర్చునే వాళ్ళు. కొంతకాలానికి అత్తగానో, అమ్మగానో అవకాశం వస్తే రీ ఎంట్రీ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మన స్టార్ హీరోయిన్స్ కి హీరోయిన్స్ గా డిమాండ్ ఉండగానే డిజిటల్ ప్లాట్ ఫాం లో మళ్ళి మంచి ఛాన్సెస్ వచ్చి స్టార్ తిరిగిపోతుంది. అందులో భాగంగా వెబ్ సిరీస్ లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. అంతేకాదు వందల్లో ఖర్చు పెట్టి థియోటర్స్ కి వెళ్ళాల్సిన అవసరం లేని వెబ్ సిరీస్ లకి ఇప్పుడు మంచి ఆదరణ కూడా లభిస్తోంది.

 

దీంతో సినీ ప్రముఖులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక ఇక్కడ ప్రముఖ నిర్మాణ సంస్థలు వెబ్ సిరీస్ లు నిర్మిస్తుండటం కూడా చాలా మంది స్టార్స్ కి బాగా క్యాష్ చేసుకునే ఛాన్స్ దక్కుతుంది. దీంతో స్టార్ హీరోయిన్లు ఆ తరహా వెబ్ సిరీస్ లలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పటికే ‘ది ఫ్యామిలీ మ్యాన్’ అనే వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ లో నటించింది. మరో వైపు కాజల్ కూడా ఇటీవలే ఓ వెబ్ సిరీస్ కి కమిట్ అయ్యింది. ఈ నేపథ్యంలో స్టార్ హీరోయిన్.. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా తమిళం లో ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని లేటెస్ట్ న్యూస్.

మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో.. తండ్రి- కూతుళ్ల మధ్య అనుబంధం నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ సాగుతుంది. తన పాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఉండటంతో వెంటనే తమన్నా ఓకే చెప్పిందట. అంతేకాదు ఒక వైపు సినిమాలు చేస్తూ మరో వైపు వెబ్ సిరీస్ లతో ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అవుతుంది. ఇక తమన్నా ప్రస్తుతం తెలుగులో ‘సీటీమార్’ సినిమాలో నటిస్తుంది. గోపీచంద్ హీరోగా.. సంపత్ నంది దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాతో పాటు హిందీలో ‘బోల్ చుడియన్’ సినిమాలోను నటిస్తూ తమన్నా బిజీగా ఉంది. ఇక తాజాగా తెరకెక్కిన బాలీవుడ్ హిట్ మూవీ ‘క్వీన్’ రీమేక్ ‘దట్ ఈజ్ మహాలక్ష్మి’ విడుదలకు సిద్దంగా ఉంది. మొత్తానికి తమన్నా 2020 లో అటు సినిమాలు ఇటు వెబ్ సిరీస్ లతో 2020 ఆడబోతుందనమాట.

Read more RELATED
Recommended to you

Latest news