ఇదేం ఖర్మ…? బాబోయ్ మళ్ళీ కొత్త వైరస్…!

-

ఇప్పుడు ప్రపంచాన్ని వైరస్ లు భయపెడుతున్నాయి. ఒక దాని తర్వాత మరొకటి వరుసగా వస్తు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి వైరస్ లు. ఎన్ని విధాలుగా వాటిని అడ్డుకోవాలని ప్రభుత్వాలు చూసినా పెద్దగా ఫలితం మాత్రం ఉండటం లేదనే చెప్పాలి. కరోనా వైరస్ దెబ్బకు మనుషులు ప్రాణాలు కోల్పోతుంటే, తాజాగా సోకిన అంతు చిక్కని వైరస్ కి కోళ్ళు ప్రాణాలు కోల్పోతున్నాయి. దీనితో రైతులు నష్టపోతున్నారు.

ఇక తాజాగా మరో వైరస్ బయటపడింది. ఈ వైరస్ దెబ్బకు ఇప్పుడు పండ్ల తోటల రైతులు ఇబ్బంది పడుతున్నారు. రుగోస్ అనే కొత్త వైరస్… పండ్ల తోటల్ని నాశనం చేస్తోంది. కేరళలో ఈ వైరస్ ని గుర్తించారు అధికారులు. ఇప్పుడు దక్షిణ భారత దేశం మొత్తం వ్యాపిస్తుంది. దీని తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగగిస్తోంది. ఏపీలో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి,

కృష్ణ జిల్లాల్లో 10,226 హెక్టార్లలో కొబ్బరి, 11,774 హెక్టార్లలో అయిల్‌పామ్ సాగుపై రుగోస్ వైరస్ ప్రభావం చూపిస్తోంది. అంతేకాదు… అరటి, జామ, సీతాఫలం పండ్ల తోటలను కూడా ఈ వైరస్ పూర్తిగా నాశనం చేస్తుంది. ఏపీ సరిహద్దున ఉన్న ఖమ్మం జిల్లాలోని అయిల్‌పామ్‌లకు సోకిన ఈ వైరస్ మరింత విస్తరించకుండా ప్రయత్నిస్తున్నారు. తెల్లదోమ వల్ల సోకే రుగోస్ వైరస్‌ను ఏపీలో మొదట తూర్పు గోదావరి జిల్లాలోని కడియంలో కొబ్బరి చెట్లపై గుర్తించారు అధికారులు.

ముందు మొక్కలోని రసాన్ని పీల్చి వేస్తుంది. దీనితో క్రమంగా ఆకులు ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. తద్వారా చెట్టు చచ్చిపోతుంది. ఇప్పుడు దీనికి ఏ మందుని పిచికారీ చెయ్యాలో ఎవరికి అర్ధం కావడం లేదట. ఎన్ని చర్యలు తీసుకున్నా సరే అదుపులోకి రావడం లేదు. ఉభయగోదావరి జిల్లాలో అరటి తోటలు ఎక్కువగా ఉన్నాయి. దీనితో రైతులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని అధికారులే అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news