విజ‌యేంద్ర ప్ర‌సాద్ మాట‌ల‌తో ఆర్ ఆర్ ఆర్‌పై పెరిగిన హైప్స్‌!

-

దేశంలోని సినీ ప్రేమికులంద‌రూ ఎదురుచూస్తున్న మోస్ట్ వాంటెడ్ సినిమా ఆర్ ఆర్ ఆర్‌. ద‌ర్శ‌క ధీరుడు బాహుబ‌లి త‌ర్వాత మొద‌టి సారి ఇద్ద‌రు స్టార్ల‌ను పెట్టి భారీ బడ్జెట్‌తో తీస్తుండ‌టంతో ఈ మూవీపై అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ తో పాటు బాలీవుడ్ బ్యూటీ ఆలియాభ‌ట్‌, బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ న‌టిస్తుండ‌టంతో హిందీలోనూ దీనిపై మంచి క్రేజ్ ఉంది.

అయితే ప్ర‌స్తుం క‌రోనా కార‌ణంగా సినిమా షూటింగ్ బ్రేక్ ప‌డింది. ఈ మూవీకి సంబంధించి కేవ‌లం చివ‌రి షెడ్యూల్ మాత్ర‌మే ఉంద‌ని తెలుస్తోది. మిగిలిన షూటింగ్‌లో కీలకమైన రెండు పాట‌ల‌తో పాటు రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల‌పై ఓ భారీ యాక్షన్ ఫైట్ ఉంటుంద‌ని తెలుస్తోంది. 8 లేదా 10 వారాల్లో షెడ్యూల్ ను కంప్లీట్ చేస్తారంట‌.

ఇక జులై మొదటి వారంలోనే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ స్టార్ట్ చేస్తార‌ని తెలుస్తోంది. ఇదిలా ఉంటే రీసెంట్‌గా రాజ‌మౌళి తండ్రి, ఆర్ ఆర్ ఆర్ రైట‌ర్ అయిన విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఈ మూవీ గురించి మాట్లాడుతూ కీల‌క విష‌యాలు చెప్పారు. ఈ సినిమాలోని ఓ ఫైట్ ఖచ్చితంగా అంద‌రినీ కంటతడి పెట్టిస్తుంన్నారు. దీంతో అభిమానుల్లో అంచ‌నాలు ఒక్క‌సారిగా డ‌బుల్ అయ్యాయి. ఎక్క‌డైనా ఎమోష‌నల్ సీన్లు క‌న్నీళ్లు పెట్టిస్తాయి. కానీ ఇందులో ఓ ఫైట్ క‌న్నీళ్లు పెట్టించ‌డం కొత్తగా ఉంద‌ని అభిమానులు ఎక్సైట్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news