ఇండియన్-2.. షూటింగ్ స్టార్ట్..!

-

శంకర్ డైరక్షన్ లో రెండు దశాబ్ధాల క్రితం రిలీజైన సినిమా ఇండియన్. అప్పట్లో సంచలన విజయం అందుకున్న ఈ సినిమాకు సీక్వల్ గా ఇన్నాళ్లకు ముహుర్తం కుదిరింది. శంకర్, కమల్ మళ్లీ అదే కాంబినేషన్ లో ఇండియన్ సీక్వల్ గా ఇండియన్-2 వస్తుంది. లైకా ప్రొడక్షన్స్ లో సుభాస్కరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించి ఫస్ట్ లుక్ ఈమధ్యనే రిలీజై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రేపటి నుండి మొదలు పెడుతున్నారట. షూటింగ్ స్టార్ట్స్ టుమారో అంటూ ఇండియన్-2 చిత్రయూనిట్ మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఓల్డర్, వైసర్, డెడ్ లయర్ అనే ట్యాగ్స్ తో రిలీజ్ చేసిన ఈ పోస్టర్ లో ఓల్డ్ గెటప్ లో కమల్ లుక్ అదిరిపోయింది. 2.ఓ అంచనాలను అందుకోకున్నా ఇండియన్-2 సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు శంకర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version