ఎన్టీఆర్ మహానాయకుడులో కె.సి.ఆర్..?

-

క్రిష్ డైరక్షన్ లో వచ్చిన ఎన్.టి.ఆర్ బయోపిక్ మొదటి పార్ట్ కథానాయకుడు సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. సినిమా డిజాస్టర్ గా మిగిలేలా ఉంది. సినిమాకు భీభత్సమైన ప్రమోషన్స్ చేసినా వసూళ్లను మాత్రం పెంచలేకపోయారు. సినిమా హిట్టా ఫట్టా అన్నది పక్కన పెడితే ఎన్.టి.ఆర్ పాత్రలో బాలకృష్ణ మెప్పించారనే చెప్పాలి. కమర్షియల్ గా మాత్రం ఎన్.టి.ఆర్ కథానాయకుడు డిజప్పాయింట్ చేసింది.

ఈ సినిమా సెకండ్ పార్ట్ ఎన్.టి.ఆర్ మహానాయకుడు సినిమా ఫిబ్రవరి 7న వస్తుంది. ఇది కంప్లీట్ గా ఎన్.టి.ఆర్ రాజకీయ చరిత్రకు సంబందించిన కథతో వస్తుంది. పార్టీ పెట్టడం.. చైతన్య యాత్ర.. ఎన్నికలు.. అధికారం.. నాదెండ్ల వెన్నుపోటుతో పాటుగా కేంద్రంపై సాగించిన పోరు.. మళ్లీ అధికారంలోకి రావడం ఇంతవరకు ఎన్.టి.ఆర్ మహానాయకుడులో ఉంటుందట. బసవతారకం బ్రతికి ఉన్నప్పటి వరకే ఎన్.టి.ఆర్ కథ చెబుతారట.

ఇక ఈ పార్ట్ లో చంద్రబాబు పాత్ర హైలెట్ చేస్తారని తెలుస్తుంది. అయితే టిడిపి హయాంలో కె.సి.ఆర్ కూడా పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణా ముఖ్యమంత్రి అయిన కె.సి.ఆర్ కు సంబందించి కొన్ని సన్నివేశాలు ఎన్.టి.ఆర్ మహానాయకుడు సినిమాలో పెట్టబోతున్నారట. అలా పెట్టడం వల్ల తెలంగాణాలో ఈ సినిమాకు ఇంకాస్త క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియదు కాని ఎన్.టి.ఆర్ బయోపిక్ లో కె.సి.ఆర్ ఉంటే మాత్రం ఆ కిక్ వేరేలా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version