బాల‌య్య మూడు సినిమాలు ఫిక్స్‌..!

-

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ‌కు ఈ యేడాది చేదు ఫ‌లితం మిగిల్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు చూస్తే బాల‌య్య త‌న తండ్రి ఎన్టీఆర్ బ‌యోపిక్‌ల్లో న‌టించ‌గా అవి రెండో ఘోర‌మైన డిజాస్ట‌ర్ అయ్యాయి. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు రెండూ ఘోర‌మైన డిజాస్ట‌ర్ అయ్యాయి. ఇక ఎన్నిక‌ల్లో బాల‌య్య హిందూపురం నుంచి వ‌రుస‌గా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచినా పార్టీ ఘోరంగా ఓడిపోవ‌డంతో బాల‌య్య కొద్ది రోజుల పాటు డీలాప‌డ్డాడు.

interesting details about balakrishna next movies

కాస్త గ్యాప్ తీసుకుని మ‌ళ్లీ మొఖానికి రంగేసుకుంటున్నాడు. ఇప్పుడు చ‌క‌చ‌కా మూడు ప్రాజెక్టుల‌ను లైన్లో పెట్టేశాడు. కోలీవుడ్ డైరెక్ట‌ర్ కేఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే సినిమాలో న‌టిస్తున్నాడు. బాల‌య్య డ్యూయ‌ల్ రోల్ చేస్తోన్న ఈ సినిమాకు రూల‌ర్ టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. సీ క‌ళ్యాణ్ ఈ సినిమాకు నిర్మాత‌. భారీ విదేశీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. డిసెంబ‌ర్ 21న ఈ సినిమా రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

ఇక డిసెంబ‌ర్ నుంచి బోయ‌పాటి సినిమా సెట్స్ మీద‌కు వెళ్లిపోవ‌డం ఖాయ‌మైన‌ట్టు తెలుస్తోంది. వీరిద్ద‌రి కాంబోలో హ్యాట్రిక్ కోసం అంద‌రూ వెయిట్ చేస్తున్నారు. వ‌చ్చే స‌మ్మ‌ర్‌కు రిలీజ్ చేసేలా ప్లాన్ జ‌రుగుతోంది. నిర్మాత ఎవ‌ర‌నేది ఖ‌రారు కావాల్సి ఉంది. బోయ‌పాటికి ప‌క్కా స్టోరీతో రెడీగా ఉండాల‌ని కూడా చెప్పేశాడ‌ట‌. ఈ రెండు సినిమాలు ఖ‌రారైపోయాయి. ఈ రెండు సినిమాలు కాకుండా దిల్ రాజు బాల‌య్య‌తో ఓ సినిమాకు ఎప్ప‌టి నుంచో ప్లాన్ చేస్తున్నాడు.

బాలీవుడ్‌లో హిట్ అయిన పింక్ సినిమాను బాల‌య్య‌తో రీమేక్ చేసే ప్లాన్‌లో రాజు ఉన్న‌ట్టు టాక్ వ‌చ్చింది. బోనీక‌పూర్ – రాజు క‌లిసి ఈ సినిమా నిర్మిస్తారంటున్నారు. ఇక బాల‌య్యతో సినిమాకు ఇస్మార్ట్ శంక‌ర్ జోష్‌తో ఉన్న పూరి జ‌గ‌న్నాథ్ కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఏదేమైనా బాల‌య్య ఫుల్ జోష్‌తో వ‌రుస‌గా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news