మహేష్.. సుకుమార్.. టైటిల్ అదేనా..!

-

సూపర్ స్టార్ మహేష్ మహర్షి సినిమా తర్వాత సుకుమార్ డైరక్షన్ లో మూవీ చేస్తాడని అందరికి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. మహేష్ శ్రీమంతుడు సినిమాతో నిర్మాణ రంగంలోకి దిగిన మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు మహేష్ సినిమా కోసం ఎక్కువ జాగ్రత్త వహిస్తున్నారని తెలుస్తుంది. ఆల్రెడీ మహేష్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 1 నేనొక్కడినే నిర్మాతలకు భారీ లాస్ తెచ్చి పెట్టింది.

అయితే ఆ బ్యాడ్ సెంటిమెంట్ ఏమి పట్టించుకోకుండా సుకుమార్ మీద పూర్తి నమ్మకంతో ముందుకెళ్తున్నారట. స్క్రిప్ట్ ఓకే అయిన ఈ సినిమాకు టైటిల్ గా హర హర శంభో శంకర అని పెట్టబోతున్నారట. టైటిల్ కాస్త విచిత్రంగా ఉన్నా సుకుమార్, మహేష్ లు ఈ టైటిల్ కు ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది. అయితే మైత్రి బ్యానర్ లో కాకుండా సుకుమార్ తన బ్యానర్ లో అది కూడా తన కో డైరక్టర్ చేత ఈ టైటిల్ రిజిస్టర్ చేయించాడట.

మైత్రి బ్యానర్ లో రిజిస్టర్ చేయిస్తే వెంటనే అందరికి తెలుస్తుదని సుక్కు ఈ ప్లాన్ వేశాడట. అయినా సరే కో డైరక్టర్ రిజిస్టర్ చేయించింది మహేష్ సినిమాకే అనేస్తున్నారు. మరి సినిమా టైటిల్ క్లాసీగా ఉండగా సబ్జెక్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఏప్రిల్ లో మహర్షి రిలీజ్ కాగానే త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version