బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ గా అనుష్క..?

రెండు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ రియాలిటీ షో మొదటి సీజన్ కు ఎన్.టి.ఆర్, రెండవ సీజన్ కు నాని హోస్ట్ గా చేశాడు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ 3వ సీజన్ కు రంగం సిద్ధం చేశారు. త్వరలోనే ఈ షో మొదలు కాబోతుంది. ఇప్పటికే ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టంట్స్ లిస్ట్ ఇదే అంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఇదిలాఉంటే ఇంతకీ బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ ఎవరన్నది ఇంకా తేలలేదు.

తారక్ కు ఛాన్స్ లేదని చెప్పగా.. నాగార్జున కోసం ప్రయత్నించారు.. వెంకటేష్, విజయ్ దేవరకొండ బిగ్ బాస్ హోస్ట్ గా అందరి పేర్లు వినిపించాయి. అయితే లేటెస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 3 కి హోస్ట్ గా స్వీటీ అనుష్కను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. తెలుగులో అనుష్క ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అయితే అనుష్క క్రేజ్ ఎంత ఉన్నా ఇలాంటి రియాలిటీ షోకి హోస్ట్ గా చేయాలంటే ఫీమేల్ హోస్ట్ కన్నా మేల్ హోస్ట్ అయితేనే బెటర్. బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ ఎవరన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. మరి హోస్ట్ గా అనుష్క కన్ ఫామా కాదా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.