మన కథలకు అక్కడ మంచి గిరాకి ఉంది..!

-

తెలుగు సినిమాకు మంచి రోజులొచ్చాయి.. ఒకే రకమైన కథలతో అటు తిప్పి ఇటు తిప్పి తీసే దర్శకులు కథలను మార్చేశారు.. కొత్త కథలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇదిలాఉంటే ఇక్కడ కథలను హిందిలో కూడా మంచి గిరాకి ఏర్పడింది. తెలుగులో సూపర్ హిట్టైన సినిమాలను హిందీలో రీమేక్ చేస్తున్నారు.

ఒక భాషలో హిట్టైన సినిమాను మరో భాషలో రీమేక్ చేయడం సర్వసాధారణమే. ముఖ్యంగా మన కథలు బాలీవుడ్ మేకర్స్ ను ఆకర్షిస్తున్నాయి. లేటెస్ట్ గా అర్జున్ రెడ్డి, ఎఫ్-2, ఆరెక్స్ 100 ఇవి రీమేక్ చేయబోతున్నారు. వీటితో పాటుగా గీతా గోవిందం, ఆపరేషన్ గరుడవేగ, గూఢచారి సినిమాలు హిందిలో రీమేక్ ప్లాన్స్ లో ఉన్నాయి.

తెలుగు సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అయ్యి మంచి సక్సెస్ సాధించాయి. వాటిలో భాగి-2, సింబా సినిమాలు ఉన్నాయి. బాగి 2 సినిమా క్షణం సినిమా రీమేక్ గా వచ్చింది. టెంపర్ సినిమా రీమేక్ గా సింబా సినిమా కూడా వసూళ్ల వర్షం కురిపించింది.

బాలీవుడ్ లో రీమేక్ అయిన మరికొన్ని తెలుగు సినిమాలు చూస్తే.. పరుగు సినిమాను హీరో పంటీగా చేయగా.. వర్షం సినిమా భాగీగా రీమేక్ అయ్యింది. రౌడీ రాథోర్ సినిమా విక్రమార్కుడును రీమేక్ చేశారు. మహేష్ పోకిరి సినిమాను వాంటెడ్ గా.. కిక్ ను అదే పేరుతో బాలీవుడ్ రీమేక్ చేశారు. అంతేకాదు భజరంగీ భాయ్ జాన్ కథ పసివాడి ప్రాణం సినిమా కథను కాస్త మార్చి విజయేంద్ర ప్రసాద్ భజరంగీ భాయ్ జాన్ సినిమా కథ రాసుకున్నాడు.

కేవలం హిందిలోనే కాదు తమిళంలో కూడా తెలుగు సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. ఒక్కడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, జయం సినిమాలు రీమేక్ అయ్యాయి. కన్నడలో రీమేక్ అయిన తెలుగు సినిమలు అత్తారింటికి దారేది, కుమారి 21ఎఫ్, బృందావనం, దూకుడు. ఇక్కడ హిట్టవడమే కాకుండా బాలీవుడ్ వాళ్లను ఆకర్షించి రీమేక్ రైట్స్ రూప్మలో కూడా తెలుగు కథలను మంచి డిమాండ్ ఏర్పడింది. అలా కూడా నిర్మాతలు లాభపడే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news