కాస్టింగ్‌ కాల్‌.. ‘కేజీఎఫ్ 2’ లో మీరు నటించవచ్చు..!

ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన సినిమా కె.జి.ఎఫ్ చాప్టర్ 1. కన్నడ పరిశ్రమలోనే కాదు మిగతా భాషల్లో కూడా ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. ఇక ఇప్పుడు కె.జి.ఎఫ్ చాప్టర్ 2 సెట్స్ మీద ఉంది. ముందు పార్ట్ కన్న ఈ సీక్వల్ ను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబందించిన కాస్టింగ్ కాల్ ఒకటి జరుగుతుంది.

సినిమాలో నటించేందుకు నటీనటులు కావాలని వారి కోసం ఆడిషన్స్ ఏర్పాటు చేస్తున్నారు. 8 నుండి 16 సంవత్సరాలు వయసు గల బోయ్స్ తో పాటుగా 25 ఏళ్లు పైగా ఉన్న జెంట్స్ కావాలట. ఏపిల్ 26న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఆడిషన్స్ జరుగుతాయని తెలుస్తుంది. బెంగళూరులో మళ్లీశ్వరం వెస్ట్ లో జిఎం రిజాయ్ ఆడియోటోరియంలో ఈ ఆడిషన్స్ జరుగనున్నాయి. నటన మీద ఆసక్తి ఉన్న ఎవరైనా సరే ఈ ఆడిషన్స్ లో పాల్గొనవచ్చు. ఒక నిమిషం సొంత డైలాగ్ ప్రాక్టీస్ చేసి అక్కడ సెలక్టర్స్ ముందు చేయాల్సి ఉంటుంది.