హరీష్ శంకర్ చిరంజీవి ని డ్యూయల్ రోల్ లో చూపించబోతున్నాడా ..?

-

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆచార్య టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ని 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా చిరంజీవి తనయుడు రాం చరణ్ ముఖ్య పాత్రలో నటించనున్నాడు. మణిశర్మ సంగీతమందిస్తున్నారు. చాలా కాలం తర్వాత చిరంజీవి మణిశర్మ కాంబినేషన్ రీపటవుతుండటం విశేషం.

 

ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి మరో మూడు ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టిన సంగతి తెలిసందే. వాటిలో ఒకటి సుజీత్ తెరకెక్కించబోతున్నాడు. సాహో వంటి పాన్ ఇండియా సినిమాని తెరకెక్కించి ఇండస్ట్రీ మొత్తాన్ని ఆకట్టుకున్న సుజీత్ లూసీఫర్ సినిమాని మెగాస్టార్ తో రీమేక్ చేయనున్నాడు. పొల్టికల్ బ్యాగ్డ్రాప్ లో రూపొందనున్న ఈ సినిమా స్క్రిప్ట్ ని తెలుగు నేటివిటికి అలాగే చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టుగా సురీజ్ తీర్చిదిద్దుతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత బాబి లేదా హరీష్ శంకర్ తో సినిమా ఉండబోతుందట.

అయితే హరీష్ శంకర్ చిరంజీ కోసం మాస్ కథ ని సిద్దం చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. గతంలో వచ్చిన రౌడీ అల్లుడు తరహాలో కంప్లీట్ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమాని రూపొందించడానికి స్క్రిప్ట్ సిద్దం చేస్తున్నాడట. చిరంజీవి రీ ఎంట్రీ మూవి ఖైదీ నంబర్ 150 లో డ్యూయల్ రోల్ లో నటించిన చిరంజీవిని మళ్ళీ హరీష్ శంకర్ డ్యూయల్ రోల్ లోనే చూపించబోతున్నట్టు తెలుస్తుంది. రెండు పాత్రలు ఒకదానికి ఒకటి సంబధం లేకుండా ఒకటి క్లాస్ క్యారెక్టర్ ఒకటి పక్కా మాస్ క్యారెక్టర్ గా రూపొందించనున్నారని తెలుస్తుంది. ఇక గతంలో ను చిరంజీవి ముగ్గురు మొనగాళ్ళు సినిమాలో త్రిపాత్రాభినయం చేసిన సంగతి తెలిసందే. అలాగే కొన్ని సినిమాలలో డ్యూయల్ రోల్ లో నటించి సూపర్ హిట్స్ ని అందుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news