అక్టోబర్ నుండి ఐకాన్ మొదలవబోతుందా ..వేణు శ్రీ రాం ది లక్కే లక్కు ..!

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దిల్ రాజు కాంబినేషన్ లో ఇంతకముందు వచ్చిన ఆర్య, పరుగు, దువ్వాడ జగన్నాధం సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా ఆర్య అయితే ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అల్లు అర్జున్ కి స్టైలిష్ స్టార్ అన్న ఇమేజ్ కూడా తీసుకు వచ్చింది. అంతేకాదు అల్లు అర్జున్ కెరీర్ రెండవ సినిమానే ఇంతటి సక్సస్ సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఈ సినిమా జడ్జ్‌మెంట్ విషయంలో దిల్ రాజు ని అందరు పొగడ్తలతో ముంచెత్తారు. ఇక మరోసారి దిల్ రాజు అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. నాని తో ఎం.సి.ఏ సినిమాని తెరకెక్కించిన వేణు శ్రీ రాం దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఐకాన్ తెరకెక్కనుంది.

 

ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా నిర్మాత దిల్ రాజు ఆగిపోయిందనుకున్న ‘ఐకాన్’ సినిమా పోస్టర్ ని రిలీజ్ చేసి ఈ ప్రాజెక్ట్ అప్‌డేట్ ని ఇచ్చారు. వాస్తవంగా నా పేరు సూర్య’ సినిమా తర్వాత అల్లు అర్జున్ నటించాల్సిన సినిమా ఐకాన్. కాని కథ విషయం లో క్లారిటి లేకపోవడంతో స్క్రిప్ట్ పక్కాగా సిద్దమయ్యకే షూటింగ్ మొదలు పెట్టాలన్న ఆలోచనతోనే ఈ ప్రాజెక్ట్ పెండింగ్ పడిందట.

ఈ లోపు వేణు శ్రీరాం పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ ని తెరకెక్కిస్తున్నాడు. రీసెంట్ గా అల వైకుంఠపురములో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని సంక్రాంతి బరిలో దింపేందుకు సిద్దమవుతున్నారు. అయితే వేణు శ్రీ రాం వకీల్ సాబ్ కంప్లీట్ అవగానే ఐకాన్ ని తెరమీదకి తీసుకు వస్తాడని తాజా సమాచారం. ఆగస్టు 15 న వకీల్ సాబ్ రిలీజ్ చేయాలని దిల్ రాజు ప్లాన్స్ వేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కాగానే అక్టోబర్ నుండి లేదా నవంబర్ నుండి ఐకాన్ ని మొదలు పెట్టి సమ్మర్ స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని తాజా సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version