బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న మరో భారీ చిత్రం ఆర్.ఆర్.ఆర్. ఇద్దరు రియల్ హీరోస్ పాత్రలతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నామని రాజమౌళి ప్రెస్ మీట్ లో వెళ్లడించారు. సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్ గా తారక్ నటిస్తున్నారు. ఇద్దరిని ఓరోజు పిలిచి ఓ అద్భుతమైన కథ చెప్పాడట రాజమౌళి.
ఇక ప్రెస్ మీట్ లో ప్రశ్నోత్తరాలలో మీ ఇద్దరు మల్టీస్టారర్ సినిమా చేయడం గొప్ప విషయం. అయితే రాజమౌళి కాకుండా వేరే దర్శకుడు అయితే మీరు ఒప్పుకుంటారా అని అడిగారు. అయితే దాని తారక్ ఫ్యూచర్ లో జరిగే వాటి గురించి ఇప్పుడు చెప్పలేం కాని ఆర్.ఆర్.ఆర్ మాత్రం రాజమౌళి చేస్తున్నాడు కాబట్టే మేము ఒప్పుకున్నామని అన్నాడు. పరిశ్రమలో నాకు మంచి స్నేహితుడు కష్టసుఖాల్లో పాలుపంచుకునే చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.
మా జెనరేషన్ లో ఇది ఓ మంచి పరిణామమని అన్నారు. తారక్ చెప్పిన మాటలకు నేను అగ్రీ అవుతున్నా తారక్ తనకు మంచి మిత్రుడు అతనితో స్క్రీన్ షేర్ చేసుకోవడం తనకు ఆనదంగా ఉందని అన్నారు. అంతేకాదు ఇద్దరికి నటులుగా మరింత పరిపూర్ణత సాధించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే రాజమౌళి కాబట్టే ఈ సినిమా చేస్తున్నాం అన్న మాట కొందరి దర్శకులకు నచ్చలేదు. కేవలం రాజమౌళి ఒక్కడే ఇండస్ట్రీని నడిపించట్లేదు కదా. జక్కన్న గొప్ప దర్శకుడే కాని అతను కాకుంటే మిగతా దర్శకులు ఎవరో తమని ఒప్పించలేరు అనే విధంగా తారక్, రాం చరణ్ కామెంట్స్ ను అర్ధం చేసుకుంటున్నారు. మరి ఈ విషయం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.