హీరోయిన్ కలర్స్ స్వాతి ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం అదేనా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తెలుగు నటిగా గుర్తింపు తెచ్చుకున్న కలర్స్ స్వాతి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే.. మొదట కలర్స్ ప్రోగ్రాం ద్వారా తన కెరియర్ను మొదలు పెట్టిన స్వాతి, ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశాలను అందుకుంది. ఇకపోతే మొదట్లో వరుస సినిమాలతో ప్రేక్షకులను సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల కాలంలో పూర్తిగా వెండితెరకు దూరమయ్యారు అని చెప్పవచ్చు.. నిజానికి సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం.. అందుకే తెలుగు అమ్మాయిలు గ్లామర్ షో చేయరు కాబట్టే వారికి అవకాశాలు రావు అంటూ పెద్ద ఎత్తున శ్రీ రెడ్డి లాంటి వాళ్లు రచ్చ చేసిన విషయం తెలిసిందే.Colors Swathi Deletes Wedding Pictures; Raises Doubts

ఇప్పటికే చాలామంది గ్లామర్ షో కి దూరంగా ఉండడం వల్ల తెలుగమ్మాయిలకు సినిమాల అవకాశాలు రాలేదనే విషయం కూడా స్పష్టం అయింది. ఇక ఈ క్రమంలోని కలర్స్ స్వాతి కూడా కొన్ని రకాల పాత్రలు మాత్రమే చేయాలి అని గీత తీసుకున్నారు. అలా తన కంఫర్ట్ జోన్ దాటి సినిమా అవకాశాలు వచ్చాయి.. అందుకే వాటిని సున్నితంగా తిరస్కరించింది. ఇక ఒకవైపు అవకాశాలను కోల్పోవడమే కాకుండా మరొకవైపు తన గ్లామర్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడమే ఇందుకు కారణమని సమాచారం.. నిజానికి కలర్స్ స్వాతి ఎంతో మంది యువతకు కలల రాకుమారి అని చెప్పవచ్చు.

నిజానికి వయసులో చిన్నది అయినప్పటికీ తన ముఖ కవళికలు మాత్రం తాను చాలా వయసున్న అమ్మాయిల కనిపించేలా చేసేవి. ఇకపోతే గ్లామర్ షో కి దూరంగా ఉండడం వల్లే కలర్స్ స్వాతి సినీ ఇండస్ట్రీకి దూరం అయింది. కనీసం ఇప్పుడైనా కార్తికేయ 2 సినిమాలో వస్తుందని అందరూ అనుకున్నారు.. కానీ ఆ సినిమాలో కూడా ఈమె కనిపించలేదు. అంతేకాదు పైగా వివరణ కూడా ఇచ్చారు చిత్రం యూనిట్. ఇక ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీకి దూరమైన కలర్స్ స్వాతి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి అభిమానులను అలరించాలి అని ఎంతో మంది కోరుకుంటున్నారు.