ఢిల్లీ డిప్యూటీ సీఎం ఇంటిపై సీబీఐ దాడులు

-

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటిపై సీబీఐ దాడులు జరిగాయి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు జరిగినట్లు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై ఆరోపణ వచ్చాయి. ఈ క్రమంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తనిఖీలు చేపట్టింది. శుక్రవారం ఢిల్లీలోని సుమారు 20 ప్రదేశాల్లో సోదాలు జరిపినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు.

సీబీఐ దాడులు
సీబీఐ దాడులు

ఈ విషయాన్ని మనీష్ సిసోడియా ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. తన ఇంటిపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. సీబీఐ అధికారులకు సహకరించినట్లు ఆయన పేర్కొన్నారు. విపక్షాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థలు దాడులు నిర్వహిస్తోందన్నారు. దేశ అభివృద్ధి కోసం పాటుపడే వారిపై దర్యాప్తు సంస్థలు వేధించడం దురదృష్టకరమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news