ఎన్టీఆర్ – ప్రణతి వివాహం వెనుక ఇంత కథ జరిగిందా..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాను తెరకేక్కించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇకపోతే ఈయన ఎంత పాపులారిటీ తెచ్చుకున్నారో.. ఈయన భార్య ప్రణతి మాత్రం అటు సినీ ఇండస్ట్రీకి, ఇటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటారని చెప్పవచ్చు. ఇక 2011 మే 5వ తేదీన ఎన్టీఆర్ లక్ష్మి ప్రణతిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక వీరి 11 సంవత్సరాల వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా గడిపిన ఎన్టీఆర్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు ఫ్యామిలీతో ఆనందంగా జీవిస్తూ ఉంటారు . అంతేకాదు తన భార్య లక్ష్మీ ప్రణతితో టైం స్పెండ్ చేయడం కోసం ఆయన ఎక్కువగా విదేశాలకు వెళ్తూ వెకేషన్లు ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

ఇకపోతే ఎన్టీఆర్ – ప్రణతి పెళ్లి వెనుక ఒక పెద్ద కథ నడిచింది అనే సంగతి చాలా మందికి తెలియదని చెప్పాలి. ముఖ్యంగా వీరి పెళ్లి వెనుక పెళ్లి పెద్దగా ఎవరు వ్యవహరించారో ఇప్పుడు చూద్దాం. ఎన్టీఆర్ కి పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ అధినేత కూతురును ఎన్టీఆర్ కి ఇచ్చి పెళ్లి చేయాలని భావించారు. ఇక ఆ విషయం తెలుసుకున్న ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఎన్టీఆర్ వేరొక ఇంటికి అల్లుడు అవడం ఇష్టం లేక స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. ఈ క్రమంలోని సీనియర్ ఎన్టీఆర్ మేనకోడలు కుమార్తెను ఎన్టీఆర్ కి ఇచ్చి పెళ్లి చేయాలని భావించారు. ఇక ఈ నేపథ్యంలోని ఇరు కుటుంబ సభ్యులతో మాట్లాడి వీరి పెళ్లి పెద్దగా చంద్రబాబు నాయుడు వ్యవహరించారు.The Jr NTR and Lakshmi Pranathi love story: In pics | IndiaToday

ప్రణతి కుటుంబం కూడా బాగా డబ్బున్న కుటుంబమే వీరికి హైదరాబాదులో ఎన్నో వ్యాపారాలు కూడా ఉన్నాయి . ఇక ఎన్టీఆర్ కి ప్రణతి నచ్చడంతో వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయింది. అయితే వారి పెళ్లి జరిగే క్రమంలో లక్ష్మీ ప్రణతి మైనారిటీ అని చాలా వార్తలు వచ్చాయి. మేజర్ కాకుండానే పెళ్లి చేసుకుంటున్నారని వార్తలు వినిపించాయి . కానీ ఆమెకు 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే పెళ్లి చేశారు. ఇకపోతే ప్రణతి కోట్ల రూపాయలను కట్నకానుకలుగా తీసుకొచ్చింది. ఇక ఇలా ఎన్టీఆర్ పెళ్లి వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారు అని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news