చిన్మ‌యి కాపురంలో క‌ల‌త‌లా?

-

గాయ‌ని చిన్మయి శ్రీపాద కాపురంలో క‌ల‌త‌లు మొద‌ల‌య్యాయా? త‌న వ్య‌క్తిత్వ‌మే క‌ల‌త‌ల‌కు కార‌ణ‌మా? అంటే అవున‌నే ఓ వార్త కోలీవుడ్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తోంది. మీటూ ఉద్య‌మంలో భాగంగా లైంగిక వేధింపుల‌పై సౌత్ లోనే వ‌న్ ఉమెన్ ఆర్మీలో పోరాటం చేసింది. బ‌డా బ‌డా సాల్తీల‌ను పేర్ల‌తో స‌హా బ‌య‌ట‌కు లాగింది. బాధితుల ప‌క్షాన నిల‌బ‌డి ఒంటరిగా పోరాటం చేసింది. ఆ స‌మ‌యంలో ఎన్ని ప్ర‌తికూల ప‌రిస్థితులు ఎదురైనా ఎదురెళ్లి నిల‌బ‌డింది. తాజాగా యూపీకి చెందిన ఓ పోలీసు అత్యాచార బాధితురాల‌ని కోర్కె తీర్చ‌మ‌ని ఒత్తిడి తీసుకొచ్చాడ‌ని ఓ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. దీంతో చిన్మ‌యి మ‌రోసారి త‌న ట్యాలెంట్ చూపించింది.

చ‌ట్టాన్ని కాపాడాల్సిన పోలీసే ఇలా వ్య‌వ‌రిస్తే ఎలా? అని ప‌్ర‌శ్నించింది. అయితే అది ఫేక్ పోస్ట్ అని యూపీ పోలీస్ శాఖ అధికారికంగా తెలిపింది. అది 2017 కు సంబంధించిన ఘ‌ట‌న‌. పైగా ఆ ఎస్సై పై మ‌హిళ త‌ప్పుడు కేసు పెట్టింద‌ని..త‌మ ద‌ర్యాప్తులో తేలిన‌ట్లు వెల్ల‌డైంద‌ని పోలీస్ శాఖ వివ‌ర‌ణ ఇచ్చింది. దీంతో చిన్మ‌యి అస‌లు విష‌యం తెలుసుకుని క్ష‌మాప‌ణ‌లు కోరింది. అనంత‌రం ఆ ట్వీట్ ను డిలీట్ చేసింది. అయితే ఈ మ‌ధ్య కాలంలో ఆమె వ్య‌వ‌హారిక శైలిపై భ‌ర్త రాహుల్ ర‌వీంద్ర‌న్ పూర్తిగా అసంతృప్తిగా ఉన్నాడుట‌. దేశంలో ఎక్క‌డ ఏ సంఘ‌ట‌న జ‌రిగినా నెత్తిన వేసుకోవ‌డం తో భార్య‌పై సీరియ‌స్ అయ్యాడుట‌. త‌న స్వీయా అనుభ‌వాల గురించి చెప్ప‌డం విష‌యంలో స‌మ‌ర్ధిస్తాను గానీ….చీటికి మాటికీ ఇలా మీటూ ను ఉద్దేశించి ర‌చ్చ‌కెక్క‌డం ప‌ద్ద‌తిగా లేదంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేసాడ‌ని స‌ద‌రు వెబ్ సైట్ ఓ వార్త వ‌చ్చింది.

భ‌విష్య‌త్ లో ఇదే కంటున్యూ అయితే మ‌న‌స్ప‌ర్ధ‌లు త‌లెత్త‌డం త‌ప్ప‌వ‌ని ఆ క‌థ‌నంలో ఓ అర్ధం వ‌చ్చేలా ఓ వ్యాఖ్యం రాసారు. మ‌రి ఇందులో నిజా నిజాలు ఏంట‌న్న‌ది తేలాల్సి ఉంది. ఇప్ప‌టికే చిన్మ‌యి ప్రోఫెష‌న‌ల్ కెరీర్ కొంత వ‌ర‌కూ దెబ్బ‌తింది. కోలీవుడ్ లో పేరున్న‌ ర‌చ‌యిత‌ల‌పై లైంగిక ఆరోప‌ణ‌లు చేయ‌డంతో ఆమెకు అవ‌కాశాలు ఇవ్వ‌డానికి ముందుకు రావ‌డం లేదు. గాయ‌కులు సంఘం నుంచి కూడా త‌ప్పించారు. స‌మంత లాంటి వారు మ‌ద్ద‌తిచ్చినా… ఏకాకి ని చేసి ఎగ‌తాళి చేసేవారే కానీ ప్రోత్స‌హించేది ఎక్క‌డా.

Read more RELATED
Recommended to you

Exit mobile version