భ్రమరావతి అన్న మీ భ్రమలు తొలగించుకునేందుకు దేవుడే ఓ చాన్సిచ్చాడు. సెక్రటేరియట్‌లో సీఎం సీటులో కూర్చున్నప్పుడైనా, అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడైనా చంద్రబాబు గారికి మనసులో కృతజ్ఞతలు చెప్పుకో.. అని స్క్రిప్ట్‌లో మళ్లీ కామా పెట్టాడు.. అంటూ ట్వీట్ల వరద సృష్టించారు లోకేశ్.
ట్విట్టర్ వేదికగా ఏపీ మాజీ మంత్రి నారా లోకేశ్ మరోసారి ఏపీ సీఎం జగన్‌పై వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. లోకేశ్ ఎక్కువగా ట్విట్టర్‌లోనే స్పందిస్తుంటారు. ఆయన విమర్శించినా.. ఇంకేం చేసినా ట్విట్టర్‌లోనే.
దేవుడి స్క్రిప్ట్‌లో ట్విస్ట్‌లూ ఉంటాయి జగన్ గారూ.. దేవుడు స్క్రిప్ట్ రాస్తూ పూర్తిగా ముగించలేదు. రాస్తూ, రాస్తూ కామా పెట్టాడంతే. అది పుల్‌స్టాప్ అనుకున్నారు మీరు. ఈ గ్యాప్‌లోనే మీరు గుడినీ, గుడిలో లింగాన్ని మింగేయాలనుకుంటున్నారు.. అంటూ బాగానే ఫైర్ అయ్యారు లోకేశ్.
ఆ తర్వాత.. దేవుడు కామా తరువాత మళ్లీ స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టాడని.. మీరు అవినీతి అన్న పట్టిసీమ మోటార్లు మీతోనే ఆన్ చేయించాడు. అడ్డగోలన్న పోలవరం అంచనాలను యథాతథంగా కేంద్రంతో ఓకే చేయించాడని మరో ట్వీట్ చేశారు.
భ్రమరావతి అన్న మీ భ్రమలు తొలగించుకునేందుకు దేవుడే ఓ చాన్సిచ్చాడు. సెక్రటేరియట్‌లో సీఎం సీటులో కూర్చున్నప్పుడైనా, అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడైనా చంద్రబాబు గారికి మనసులో కృతజ్ఞతలు చెప్పుకో.. అని స్క్రిప్ట్‌లో మళ్లీ కామా పెట్టాడు.. అంటూ ట్వీట్ల వరద సృష్టించారు లోకేశ్. మరి.. దీనిపై ఏపీ సీఎం జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.
దేవుడి స్క్రిప్ట్ లో ట్విస్ట్‌లూ ఉంటాయి జగన్ గారూ!@ysjagan గారూ! దేవుడు స్క్రిప్ట్ రాస్తూ పూర్తిగా ముగించలేదు.
రాస్తూ, రాస్తూ కామా పెట్టాడంతే! అది ఫుల్స్టాప్ అనుకున్నారు మీరు. ఈ గ్యాప్‌లోనే మీరు గుడినీ, గుడిలో లింగాన్ని మింగేయాలనుకుంటున్నారు.— Lokesh Nara (@naralokesh) June 29, 2019
దేవుడు కామా తరువాత మళ్లీ స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టాడు.
మీరు అవినీతి అన్న పట్టిసీమ మోటార్లు మీతోనే ఆన్ చేయించాడు. అడ్డగోలన్న పోలవరం అంచనాలను యథాతథంగా కేంద్రంతో ఓకే చేయించాడు.— Lokesh Nara (@naralokesh) June 29, 2019
టీడీపీ హయాంలో విద్యుత్ కొనుగోళ్లు అక్రమం అని మీరంటే… అవి ముట్టుకుంటే షాక్ కొడతాయని కేంద్రంతో లేఖ రాయించాడు. దేవుడి స్కిప్ట్ లో ఇటువంటి కామాలు చాలానే ఉంటాయి.
— Lokesh Nara (@naralokesh) June 29, 2019
భ్రమరావతి అన్న మీ భ్రమలు తొలగించుకునేందుకు దేవుడే ఓ ఛాన్సిచ్చాడు. సెక్రటేరియట్‌లో సీఎం సీటులో కూర్చున్నప్పుడైనా, అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడైనా చంద్రబాబుగారికి మనసులో కృతజ్ఞతలు చెప్పుకో అని స్క్రిప్ట్ లో మళ్లీ కామా పెట్టాడు.
— Lokesh Nara (@naralokesh) June 29, 2019