తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లడం వెనుక ఉన్న నిజం ఇదే..?

నందమూరి తారకద్రత ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. నిజానికి రోజులు గడుస్తున్నాయి.. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం కుదుటపడడం లేదు.. తారకరత్న మెదడుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారని తాజాగా విజయ్ సాయి రెడ్డి వెల్లడించారు ఎయిర్ అంబులెన్స్ లో తారకరత్న విదేశాలకు తీసుకెళ్లనున్నారు అని కూడా వార్తలు వినిపించాయి. ప్రముఖ టిడిపి నేత చేసిన కామెంట్ల వల్ల తారకరత్న ఆరోగ్యం గురించి ఇప్పుడు మరొకసారి చర్చ జరుగుతోంది.

నిజానికి తారకరత్న వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడం వల్లే విదేశాలలో వైద్య చికిత్స చేయించుకుంటే మంచిదని వైద్యులు చెప్పారని సమాచారం. తారకరత్న త్వరగా కోలుకోవాలంటే ఈ విధంగా చేయాల్సి ఉంటుంది అని కూడా తెలుస్తుంది. కుటుంబ సభ్యులు చర్చించుకుని మెరుగైన వైద్యం కోసం తారకరత్న విదేశాలకు తరలించనున్నారు. అప్పటికే తారకరత్నకు షుగర్ ఉండడం వల్ల చికిత్స విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికి తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉందని.. సోషల్ మీడియాలో కూడా కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

తారకరత్న వయసు కేవలం 39 సంవత్సరాలు కాగా ఇండస్ట్రీలో వివాదాలకు కూడా దూరంగా ఉండే హీరోగా పేరు ఉంది. రాజకీయాలలో కెరీర్ మొదలు పెట్టాలనుకున్న సమయంలోనే ఈ విధంగా జరిగిందని ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. నిజానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు టాబ్లెట్స్ వాడకుండా కేవలం ఆరోగ్య సూత్రాలను ఫాలో కావడం వల్ల ఆయనకు ఈ పరిస్థితి వచ్చిందని కూడా కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా తారకరత్న త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?