త్రివిక్రమ్ ఆమెని పక్కన పెట్టేసినట్టేనా..?

అల వైకుంఠపురములో సినిమా నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డు అందుకున్న త్రివిక్రమ్, తన తర్వాతి సినిమాని ఎన్టీఆర్ తో తీస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ సిద్ధం చేస్తున్న త్రివిక్రమ్, ఈ సినిమాలో నటించే హీరోయిన్ ని వెతుకుతున్నాడట. త్రివిక్రమ్ తెరకెక్కించిన గత రెండు చిత్రాల్లో పూజా హెగ్డే హీరోయిన్ గా మెరిసింది. ఈ రెండు కూడా మంచి బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. దాంతో ఎన్టీఆర్ తో తియబోయే చిత్రంలోనూ పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించనుందనే మాటలు వినిపించాయి.

కానీ తాజా సమాచారం ప్రకారం పూజా హెగ్డేకి బదులు కీర్తి సురేష్ ని తీసుకోవాలని చూస్తున్నారట. మహానటి తో జాతీయ నటిగా అవార్డు గెలుచుకున్న కీర్తి సురేష్, అయితే బాగుంటుందని అనుకుంటున్నారట. సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న కీర్తి సురేష్, త్రివిక్రమ్ రాసుకున్న కథకి సరిగ్గా సరిపోతుందని అంటున్నారు. మరి ఈ విషయంలో అధికారిక సమాచారం ఎప్పుడు వస్తుందో చూడాలి. ప్రస్తుతానికి ఎన్టీఆర్, ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు.