టైటిల్ చూసి ఇదేదో ఆర్జివి లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ గురించి అనుకుని ఉంటారు. అలా అయితే మీరు మిస్టేక్ చేసినట్టే. ఇది మన ఆర్జివి న్యూస్ కాదు.. విజయ్ దేవరకొండ హీరోగా 2017లో సంచలన విజయం అందుకున్న అర్జున్ రెడ్డి సినిమా తమిళ, హింది భాషల్లో రీమేక్ కాబోతుంది. బాలీవుడ్ లో అర్జున్ రెడ్డిని మాత్రుక దర్శకుడు సందీప్ వంగ డైరెక్ట్ చేస్తుండగా తమిళ వర్షన్ మాత్రం బాలా డైరక్షన్ లో వస్తుంది.

ఇక ఈ సినిమాతో మరో స్టార్ వారసుడు హీరోగా వస్తున్నాడు. చియాన్ విక్రం తనయుడు ధ్రువ్ అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ తో వస్తున్నాడు. మొన్నామధ్య రిలీజైన టీజర్ ను తెలుగు ప్రేక్షకులే కాదు తమిళ ఆడియెన్స్ కూడా తిప్పికొట్టారు. అర్జున్ రెడ్డి రీమేక్ కాదు ఆ సినిమాకు స్పూఫ్ లా ఉంది అని కామెంట్లు పెట్టారు. ఇక ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. తమిళ అర్జున్ రెడ్డికి వర్మ అని టైటిల్ ఫిక్స్ చేశారు.

ఈ ట్రైలర్ సూర్య చేతుల మీదగా జనవరి 9న రిలీజ్ చేస్తారట. టీజర్ తో వచ్చిన విమర్శలు సరిచేసుకుని ట్రైలర్ జాగ్రత్త పడ్డారో లేక మళ్లీ అదే విధంగా చేశారో తెలియాలంటే 9వరకు వెయిట్ చేయాల్సిందే. అయితే ట్రైలర్ తేడా కొడితే మాత్రం వర్మ మళ్లీ బుక్కవుతాడని చెప్పొచ్చు.